Skip to main content

Good News: వీరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెంపు

దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
disabled persons
దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెంపు

ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్‌ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మూడుశాతం ఉన్న రిజర్వేషన్‌ను నాలుగు శాతానికి పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ అక్టోబర్‌ 13న ఉత్తర్వులు జారీచేశారు.

చదవండి: పోటీ పరీక్షలు రాసే వీరికి ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్‌

నిర్ధారిత వైకల్యాలున్న వారికి నాలుగు శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఏశాఖలోనైనా రిజర్వేషన్ల నుంచి మినహాయింపు అవసరమైతే అందుకు తగిన కారణాల సమర్థనతోపాటు ఇంటర్‌ డిపార్ట్‌మెంటల్‌ కమిటీ అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఈ రిజర్వేషన్‌ పెంపునకు అనుగుణంగా ఏపీ స్టేట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌–1996లో సవరణలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: TVCC: ఉచితంగా అంధ విద్యార్థులకు పుస్తకాలు

వికలాంగుల హక్కుల చట్టం–2016లోని సెక్షన్‌–34 ప్రకారం ప్రభుత్వ నియామకాలు, పదోన్నతుల్లో నిర్ధారిత వైకల్యాల వ్యక్తులకు నాలుగుశాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ 2020 ఫిబ్రవరి 19వ తేదీన మహిళా శిశు సంక్షేమ, వికలాంగుల సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించింది. 

చదవండి: Good News: ఉద్యోగాల్లో పదేళ్ల వయోపరిమితి సడలింపు

Published date : 14 Oct 2022 06:52PM

Photo Stories