పోటీ పరీక్షలు రాసే వీరికి ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్
Sakshi Education
ప్రభుత్వోద్యో గాలకు సన్నద్ధమవుతున్న దివ్యాంగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నట్లు తెలంగాణ వికలాంగుల కో–ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉచిత శిక్షణకు 1,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 700 మందిని వివిధ జిల్లాల్లోని స్టడీ సర్కిళ్లలో సర్దుబాటు చేశామని ఆయన వివరించారు. మిగిలిన వారికి ఇతర కేంద్రాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండల కేంద్రంలోని రిహాబిలిటేషన్ సెంటర్‌లో జూలై 22న వికలాంగుల కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో టీవీసీసీ జనరల్ మేనేజర్ ప్రభంజన్ రావు, ఆదాయపన్ను శాఖ కమిషనర్ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
Published date : 23 Jul 2022 01:42PM