TVCC: ఉచితంగా అంధ విద్యార్థులకు పుస్తకాలు
Sakshi Education
రాష్ట్రంలో అంధ విద్యార్థులకు డిగ్రీ వరకు ఉచితంగా బ్రెయిలీ లిపిలో పుస్తకాలు అందిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ (టీవీసీసీ) చైర్మన్ కె.వాసుదేవరెడ్డి వెల్లడించారు.
టీవీసీసీ చైర్మన్ గా ఆయన వరుసగా మూడోసారి నియమితులు కాగా, డిసెంబర్ 22న బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ఆర్థిక భరోసా కింద ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం రూ.1800 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఒక్కొక్క దివ్యాంగుడికి రూ.3016 చొప్పున పింఛన్ అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, తెలంగాణ గొర్రెలు, మేకల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బాలరాజు యాదవ్ పాల్గొన్నారు.
చదవండి:
నాణ్యమైన బోధన అందేలా పాఠ్యపుస్తకాలు
Published date : 23 Dec 2021 04:00PM