ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజుల పాటు సంక్రాంతి సెలవులు వచ్చాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు
భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా జనవరి 13, 14, 15 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ జనవరి 11న ఉత్తర్వులు జారీ చేశారు. 16వ తేదీ ఆదివారం కావడంతో మరో రోజు కలిసి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు జనవరి 14, 15, 16 తేదీల్లో ప్రకటించిన సెలవులను ఈ మేరకు మార్పు చేసింది.