జీడీఎస్ ఉద్యోగాలకు 87 మంది ఎంపిక
Sakshi Education
అనంతపురం సిటీ: అనంతపురంలోని డివిజనల్ హెడ్ పోస్టాఫీసులో జీడీఎస్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఏప్రిల్ 10న నుంచి మొదలైంది.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 87 మంది బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్లు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్లుగా ఎంపికయ్యారు. వీరిలో 21 మంది అమ్మాయిలు, 66 మంది అబ్బాయిలు ఉన్నారు. వారందరూ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆ శాఖ అధికారులతో పరిశీలించుకోవాల్సి ఉంది. ఇన్‌చార్జ్ పోస్టల్ సూపరింటెండెంట్ హరికృష్ణ ప్రసాద్ నేతృత్వంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ పార్వతి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ ఇంకా రెండు మూడు రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఎంపికై న వారందరూ కరోనా బ్యాచ్‌లో ఉత్తీర్ణత సాధించేవారిగానే తెలుస్తోంది.
చదవండి:
EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..
TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం
Published date : 11 Apr 2023 04:17PM