Skip to main content

ICAR-AIEEA PG-2024 Notification: ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ పీజీ–2024 నోటిఫికేషన్‌ విడుదల.. స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు..!

అగ్రికల్చర్, సంబంధిత రంగాల్లో కెరీర్‌ అవకాశాలకు కొదవలేదు. పీజీ స్థాయిలో అగ్రికల్చర్, అనుబంధ విభాగాల్లో స్పెషలైజేషన్స్‌ పూర్తి చేస్తే ఈ రంగంలో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు..
Notification for ICAR AIEEA PG 2024 Released

సాక్షి ఎడ్యుకేషన్‌: అగ్రికల్చర్, అనుబంధ కోర్సులను అందించడంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌)కు మంచి పేరుంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌ తాజాగా.. ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ (పీజీ)–2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ(పీజీ) కోర్సుల వివరాలు, ప్రవేశ ప్రక్రియ, పరీక్ష విధానం, భవిష్యత్తు అవకాశాలు తదితర వివరాలు..  

దేశంలో అగ్రికల్చర్‌ విద్య నిర్వహణ, పర్యవేక్షణ కోసం కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలో ఏర్పాటైన సంస్థ.. ఐకార్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌). ఈ సంస్థ పరిధిలో దేశవ్యాప్తంగా 74 అగ్రికల్చర్‌ యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్‌ వివిధ కోర్సులను అందిస్తున్నాయి. ఐకార్‌ పరిధిలోని యూనివర్సిటీలు, కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ఆల్‌ ఇండియా కోటా సీట్ల భర్తీకి ఏఐఈఈఏ(పీజీ) పరీక్షను నిర్వహిస్తున్నారు. ఆయా యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్స్‌లో 30 శాతం సీట్లకు ఏఐఈఈఏ పీజీలో ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

Tenth & Inter Results: ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌లో ఖైదీల ప్రతిభ

ఇతర రాష్ట్రాల్లో ప్రవేశం
రాష్ట్రాల స్థాయిలోని అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు.. ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ పీజీ అదనపు పరీక్షగా చెప్పొచ్చు. ఒక రాష్ట్రానికి చెందిన విద్యార్థి ఏఐఈఈఏ స్కోర్‌ ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోని అగ్రికల్చరల్‌ యూని వర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్‌లో ఆల్‌ ఇండియా కోటా పరిధిలోని 30 శాతం సీట్లకు పోటీ పడే అవకాశం లభిస్తుంది.

పీజీ కోర్సులు ఇవే
ప్లాంట్‌ బయో టెక్నాలజీ, ప్లాంట్‌ సైన్స్, ఫిజికల్‌ సైన్స్, యానిమల్‌ బయోటెక్నాలజీ, అగ్రి–బిజినెస్‌ మేనేజ్‌మెంట్, స్టాటిస్టికల్‌ సైన్స్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ/ఆగ్రో ఫారెస్ట్రీ అండ్‌ సివి కల్చర్, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, వాటర్‌ సైన్స్‌ టెక్నాలజీ, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, ఆగ్రోనమీ, ఫిషరీస్‌ సైన్స్, డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, హోంసైన్స్, సోషల్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో దాదాపు 70 స్పెషలైజేషన్స్‌లో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

School Admissions: గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

ఏఐఈఈఏ (పీజీ) అర్హత
సంబంధిత విభాగంలో బీఎస్సీ అగ్రికల్చర్‌/బీటెక్‌/బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. అర్హత కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

480 మార్కులకు పరీక్ష
ఏఐఈఈఏ(పీజీ) పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 120 ప్రశ్నలు–480 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి. నెగిటివ్‌ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్ష ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది.

Jobs In Tech Mahindra: ప్రముఖ ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రాలో ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..

స్కాలర్‌షిప్‌ సదుపాయం
ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ స్కోర్‌ ఆధారంగా.. ఐసీఏఆర్‌ అనుబంధ అగ్రికల్చర్‌ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారికి ఉపకార వేతనం లభిస్తుంది. నెలకు రూ.12,640 చొప్పున రెండేళ్ల పాటు ఐసీఏఆర్‌–పీజీ స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఆరు వందలకు పైగా ర్యాంకు సాధించిన విద్యార్థులకు నేషనల్‌ టాలెంట్‌ స్కాలర్‌షిప్‌ (పీజీ) పేరిట నెలకు రూ.5వేలు చొప్పున రెండేళ్ల పాటు ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తుంది.

ఉజ్వల కెరీర్‌కు మార్గం
ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ (పీజీ) ఎంట్రన్స్‌తో పీజీ ప్రోగ్రామ్‌లో చేరి పూర్తి చేసుకున్న వారికి చక్కటి కెరీర్‌ అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవల కాలంలో జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఫార్మింగ్‌ సెక్టార్‌ ఉద్యోగాల కల్పనలో ముందంజలో నిలుస్తోంది. దీంతో.. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నైపుణ్యం ఉన్న మానవ వనరులకు డిమాండ్‌ పెరుగుతోంది. వ్యవసాయ విద్యను అభ్యసించిన వారికి కెరీర్‌ పరంగా కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో వ్యవసాయ పంటల అమ్మకాలు, మార్కెటింగ్, రవాణా, సేవలు, నిల్వ, గిడ్డంగులు మొదలైన విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి.

CBSE 10th and 12th Results 2024 Updates: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే..

ప్రభుత్వ కొలువులు
అగ్రికల్చర్‌ అనుబంధ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధానంగా.. వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్స్, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్‌ వంటి కొలువులు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ప్లాంటేషన్స్, ఫెర్టిలైజర్‌ కంపెనీలు, అగ్రికల్చరల్‌ మెషినరీలు, అగ్రికల్చరల్‌ ప్రొడక్ట్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థల్లో కొలువులు దక్కించుకోవచ్చు. ఎఫ్‌సీఐ, నాబార్డ్‌తోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూరల్‌ బ్యాంకింగ్‌ విభాగాల్లోనూ ఆఫీసర్లు, మేనేజర్లుగా కెరీర్స్‌ సొంతం చేసుకోవచ్చు. పీహెచ్‌డీ పూర్తి చేస్తే ఐసీఏఆర్, ఐఏఆర్‌ఐ వంటి అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ కేంద్రాలతోపాటు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలోని రీసెర్చ్‌ కేంద్రాల్లో సైంటిస్ట్‌ హోదాలో స్థిరపడొచ్చు.

డిగ్రీ స్థాయి పుస్తకాల అధ్యయనం
ఏఐఈఈఏలో విజయానికి అభ్యర్థులు.. తాము దరఖాస్తు చేసుకున్న పేపర్‌ను అనుసరించి డిగ్రీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా కోర్‌ అంశాలను వాస్తవ పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ చదవాలి. అదే విధంగా డొమైన్‌ విభాగంలో కీలక భావనలు, సిద్ధాంతాలు, వాటి ఉద్దేశం వంటి వాటిపైనా దృష్టి పెట్టాలి.

 Unhealthy Air: ప్రపంచంలోనే అనారోగ్యకరమైన గాలి ఉన్న నగరాల్లో అగ్రస్థానంలో ఉన్న‌దిదే..

ముఖ్య సమాచారం

  •     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, మే 11
  •     దరఖాస్తుల సవరణ: 2024, మే 13 – 15
  •     ఎంట్రన్స్‌ తేదీ: 2024, జూన్‌ 29
  •     తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, సికిందరాబాద్, కరీంనగర్, వరంగల్‌
  •     పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in/ICAR
     

 

Published date : 03 May 2024 04:43PM

Photo Stories