209 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు
వీరిని మినిమం టైం స్కేలు(ఎంటీఎస్)పై కాంట్రాక్టు ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్)లుగా నియమించనున్నారు. ఇటీవలే పాఠశాల విద్యాశాఖ పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్‌ను జారీ చేసింది. ఏప్రిల్ 10న జిల్లా సెలక్షన్ కమిటీ ఆ పోస్టులకు ఆమోద ముద్ర వేసింది. 1998 డీఎస్సీలో అర్హత పొందిన వారిని మెరిట్ ప్రాతిపదికన ఈ పోస్టుల్లో భర్తీ చేయనున్నారు.
చదవండి:
EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..
TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం
9,231 Jobs: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ
Fake Job Notification: ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్
జిల్లాలో మొత్తం 209 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు రానున్నాయి. ఉద్యోగాలకు ఎంపికై న వారికి మంగళవారం సమాచారం ఇవ్వనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 12న నగరంలోని ఎ.క్యాప్ మాంటిస్సోరి స్కూల్‌లో ఎంపికై న వారికి నియామాక పత్రాలను ఇవ్వనున్నారు. వీరిని ఏకోపాధ్యాయ స్కూళ్లలోను, విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండి, తక్కువ మంది టీచర్లు పనిచేస్తున్న పాఠశాలల్లోనూ నియమించనున్నారు. వీరందరికీ ఈ వేసవిలో శిక్షణ ఇవ్వనున్నారు.