382 Jobs: 15 ఫైర్ స్టేషన్లు.. 382 పోస్టులు
వీటి నిర్వణకు కొత్తగా 382 పోస్టులను కూడా మంజూరు చేసింది. 367 రెగ్యులర్ పోస్టులు కాగా, 15 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీచేసేందుకు అనుమతినిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లులేని శాసనసభ నియోజకవర్గాల్లో ఈ కొత్త ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చదవండి: ఫైర్ ఇంజనీరింగ్... పుష్కల అవకాశాలు!
కొత్త ఫైర్ స్టేషన్లు నియోజక వర్గాల వారీగా... మల్కాజిగిరి, ఎల్.బి.నగర్, రాజేంద్రనగర్, షాద్ నగర్, అంబర్‌పేట, చాంద్రాయణ గుట్ట, జూబ్లీ హిల్స్, స్టేషన్ ఘన్‌పూర్, డోర్నకల్, నర్సాపూర్, హుస్నాబాద్, కల్వకుర్తి, బాల్కొండ, ధర్మపురి, పినపాక.
చదవండి: Best Certification Courses: సర్టిఫికేషన్స్‌తో.. కెరీర్ షైన్!
15 కొత్త ఫైర్ స్టేషన్లలో 7 డబుల్ యూనిట్ ఫైర్ స్టేషన్లు కాగా.. ఒక్కో డబుల్ యూనిట్ స్టేషన్ కు ఒక అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 2, లీడింగ్ ఫైర్ మెన్ 4, డ్రైవర్ ఆపరేటర్ 5, ఫైర్ మెన్ 20, జూనియన్ అసిస్టెంట్ 1, స్వీపర్ 1(అవుట్ సోర్సింగ్) పోస్టులు మంజూరు అయ్యాయి. మిగిలిన 8 సింగిల్ యూనిట్ ఫైర్ స్టేషన్లు కాగా, ఒక్కో సింగిల్ యూనిట్ స్టేషన్‌కు మంజూరు చేసినట్లు దరయంతిస్టేషన్ ఫైర్ ఆఫీసర్ 1, లీడింగ్ ఫైర్‌మెన్ 2, డ్రైవర్ ఆపరేటర్ 3, ఫైర్‌మెన్ 10, జూనియర్ అసిస్టెంట్ 1, స్వీపర్ (అవుట్ సోర్సింగ్)1 పోస్టులు మంజూరు చేశారు.