Skip to main content

ఫైర్ ఇంజనీరింగ్... పుష్కల అవకాశాలు!

సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సూత్రాలను ఉపయోగించి అగ్ని ప్రమాదాల నివారణకు, నియంత్రణకు పాటుపడేదే.. ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి, ప్రాణ, పర్యావరణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన తక్షణ చర్యల్లో ఫైర్ ఇంజనీరింగ్ పాత్ర చాలా కీలకం. నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి పరిశ్రమలో, భవనాల్లోనూ ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా మారింది. ఫైర్ ఇంజనీరింగ్ రంగంలో నిపుణులకు విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆ క్రమంలోనే ఇటీవల కాలంలో ఫైర్ ఇంజనీరింగ్ కోర్సుల పట్ల విద్యార్థుల్లో అవగాహన, ఆసక్తి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలతోపాటు సిటీలోని పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేషన్‌లు, బ్యాచిలర్ కోర్సులు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైర్ ఇంజనీరింగ్‌తో అవకాశాలపై ఫోకస్..

అర్హతలు:

ఫైర్ , సేఫ్టీ ఇంజనీరింగ్ కోర్సులను సాధారణంగా ఇంటర్మీడియెట్ అర్హతతో అభ్యసించొచ్చు. పదో తరగతితోనూ సేఫ్టీ సూపర్‌వైజర్, సేఫ్టీ స్టీవార్డ్, ఫైర్‌మన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు సేఫ్టీ ఆఫీసర్, సేఫ్టీ ఇంజనీర్, ఫైర్ ఇంజనీర్, ఫైర్ ఆఫీసర్ కోర్సుల్లో చేరొచ్చు. ఫైర్ ఇంజనీర్‌గా స్థిరపడాలంటే.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

కోర్సుల స్వరూపం:
కోర్సులో స్థూలంగా.. ఫైర్ ఇంజనీరింగ్ సైన్స్, ఫైర్ ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్, ఫైర్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్, సేఫ్టీ మేనేజ్‌మెంట్, సేఫ్టీ ఇంజనీరింగ్, లాస్‌కంట్రోల్ అండ్ సేఫ్టీ లాస్‌తోపాటు ప్రధానంగా ఫైర్ ఫైటింగ్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఆక్యుపేషనల్ హెల్త్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌పై శిక్షణ ఇస్తారు. ఫైర్ ఫైటింగ్ అనేది వివిధ విభాగాల్లో ఉంటుంది. ఆయిల్ ఫైర్, గ్యాస్ ఫైర్, మెటల్‌ఫైర్.. ఇలా ఒక్కోదాన్ని ఆర్పివేయడానికి ప్రత్యేక శిక్షణ కల్పిస్తారు. ఫైర్ ఇంజనీరింగ్‌లో భాగంగా విద్యార్థులు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ డిజైన్, స్మోక్ డిటెక్టర్స్, హైజిన్ సిస్టమ్స్ ఏ విధంగా అమర్చాల్సి ఉంటుందో అధ్యయనం చేస్తారు. పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా శిక్షణ ఇస్తారు.

నైపుణ్యాలు:
ఫైర్ ఇంజనీరింగ్ , సేఫ్టీ మేనేజ్‌మెంట్ రంగంలో స్థిరపడాలనుకునే వారు... ప్రమాదాలు సంభవించినప్పుడు లిప్తపాటులో స్పందించగలిగే లక్షణాలను కలిగి ఉండాలి. వేగంగా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలుండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. సూక్ష్మ పరిశీలనా నైపుణ్యాలూ అవసరం.

ఉద్యోగాలెక్కడ:
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఫైర్ ఇంజనీర్లకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఫైర్ సర్వీసెస్, ఆర్కిటెక్చరల్ అండ్ బిల్డింగ్ డిజైన్, ఇన్సూరెన్స్ అసెస్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇండస్ట్రీ, రిఫైనరీస్, బాట్లింగ్ ప్లాంట్స్, టెక్స్‌టైల్స్, విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించే, అగ్నిప్రమాదాలకు అవకాశమున్న ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ యూనిట్‌ల్లో ఫైర్ ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు ఉంటాయి.

వేతనాలు:
ఫైర్ ఇంజనీర్లు, సేఫ్టీ ఇంజనీర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌లుగా ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ఫైర్ ఇంజనీర్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్న గల్ఫ్ లాంటి దేశాల్లో ఎక్కువ మొత్తాన్నే చెల్లిస్తున్నారు.

ఫైర్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్న ప్రముఖ విద్యాసంస్థలు:
  • కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలో నడిచే నాగ్‌పూర్‌లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్... పలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను ఆఫర్ చేస్తోంది. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల గుర్తింపు కూడా ఉంది.
అందించే కోర్సులు
  • సబ్ ఆఫీసర్స్ ఠ స్టేషన్ ఆఫీసర్స్ అండ్ ఇన్‌స్ట్రక్టర్స్
  • డివిజనల్ ఆఫీసర్స్
  • బ్రీతింగ్ అపారెటస్ ఠ ఫైర్ ప్రివెన్షన్
  • బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్(ఫైర్)
వెబ్‌సైట్: nfscnagpur.nic.in
  • యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, డెహ్రాడూన్ డెహ్రాడూన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్(యూపీఈఎస్)... నాలుగేళ్ల బీటెక్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తోంది. యూపీఈఎస్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా 80 శాతం సీట్లును, జేఈఈ మెయిన్ స్కోరు ద్వారా 20 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
వెబ్‌సైట్: www.upes.ac.in
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్, జైపూర్ జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్... ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో కలిసి కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇంటర్మీడియెట్, డిగ్రీ అర్హతతో ప్రవేశాన్ని కల్పిస్తోంది.
కోర్సుల వివరాలు:
  • గ్రాడ్యుయేట్ లెవల్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్
  • పోస్టు గ్రాడ్యుయేట్ లెవల్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్
  • గ్రాడ్యుయేట్ లెవల్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
  • పోస్టు గ్రాడ్యుయేట్ లెవల్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
  • సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్(పైర్‌మన్)
  • సబ్‌ఫైర్ ఆఫీసర్స్ కోర్స్
వెబ్‌సైట్: www.nifesmindia.net
  • కాలేజ్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్, ఔరంగాబాద్ ఔరంగాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ పలు ఫైర్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తోంది. పదోతరగతి, ఇంటర్మీడియెట్ అర్హతలతో ప్రవేశం కల్పిస్తోంది.
కోర్సుల వివరాలు...
  • బీఎస్సీ ఫైర్ సేఫ్టీ
  • అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ
  • డి ప్లొమా ఇన్ ఫైర్ సర్వీస్ ఇంజనీరింగ్
  • డిప్లొమా ఇన్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్
  • డిప్లొమా ఇన్ సేఫ్టీ, హెల్త్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్
  • ఫైర్ ఇంజనీరింగ్(ఫైర్‌మన్)/ సేఫ్టీ ఇంజనీరింగ్
  • సివిల్ సూపర్‌వైజర్
  • బిల్డింగ్ సైట్ సూపర్‌వైజర్
  • ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనే జ్‌మెంట్
  • సెక్యూరిటీ అండ్ ఫైర్ ప్రివెన్షన్
వెబ్‌సైట్: www.fireengg.in

హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్
హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్... రెగ్యులర్, దూరవిద్యా విధానంలో పలు ఫైర్ కోర్సులను అందిస్తోంది.

కోర్సుల వివరాలు...
  • పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
  • డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
  • సేఫ్టీ ఆఫీసర్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.hifeindia.in

గ్లోబల్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
ఈ విద్యాసంస్థ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేషన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.

కోర్సుల వివరాలు:
  • పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
  • పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
  • డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
  • డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
  • ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్
వెబ్‌సైట్: www.glifse.com

హైదరాబాద్‌లో ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సులు..
ఎన్‌ఐఎఫ్‌ఎస్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్ట్ మేనేజ్‌మెంట్): హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా 50కి పైగా కేంద్రాల్లో ఈ ఇన్‌స్టిట్యూట్ ఫైర్ సేఫ్టీ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
కోర్సుల వివరాలు...
  • ఎంబీఏ సేఫ్టీ మేనేజ్‌మెంట్
  • డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ
  • డిప్లొమా ఇన్ హెల్త్ అండ్ సేఫ్టీ ఎన్విరాన్‌మెంట్
  • పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ
  • పీజీ డిప్లొమా ఇన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్
  • డిప్లొమా ఇన్ క్వాలిటీ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్‌మెంట్
  • డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్
  • పీజీ డిప్లొమా ఇన్ క్వాలిటీ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్‌మెంట్
  • బీఎస్సీ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ
వెబ్‌సైట్: www.nifsindia.net/

డిమాండ్‌కు తగిన సిబ్బంది లేరు
‘‘ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌లో అవసరాలకు తగిన సిబ్బంది అందుబాటులో లేరు. దీనికి కారణం విద్యార్థుల్లో ఈ కోర్సులపై తగిన అవగాహన లేకపోవడమే. ప్రస్తుతం అగ్ని ప్రమాదాల నివారణకు దాదాపు అన్ని పరిశ్రమలు ముందస్తు చర్యలను పటిష్టం చేస్తున్నాయి. వాటిని నిత్యం పర్యవేక్షించడానికి అగ్నిమాపక నిపుణులకు అవకాశాలను కల్పిస్తున్నాయి. అలాగే ప్రమాదాలు సంభవించిన ప్పుడు ఈ విభాగంలో శిక్షణ పొందిన వారి అవసరం ఏర్పడుతోంది. కాబట్టి ఫైర్ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో పుష్కలమైన అవకాశాలుంటాయని నిస్సందేహంగా చెప్పొచ్చు’’
సునీల్ మహంతి,
డెరైక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్ట్ మేనేజ్‌మెంట్
Published date : 16 Sep 2014 04:17PM

Photo Stories