Skip to main content

విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన

సి.బెళగల్‌: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన ఉండాలని ఉపాధ్యాయులకు డీఈఓ రంగారెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. సి.బెళగల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాన్ని డీఈఓ తనిఖీ చేశారు.
 Teaching to make students understand
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన

ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యాబోధన జరగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువులను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటరాక్టీ ప్లాట్‌ ప్యానల్‌ (ఐఎఫ్‌పీ) వినియోగం వందశాతం ఉండేలా చూడాలని ఎంఈఓలను ఆయన ఆదేశించారు.

సర్వే వంద శాతం చేపట్టాలి

సిస్టమ్‌ డ్రాపౌట్‌, స్కూల్‌ డ్రాపౌట్స్‌పై చేపట్టిన సర్వేను వంద శాతం పూర్తయ్యేలా చూడాలని మండల అధికారులను డీఈఓ రంగారెడ్డి ఆదేశించారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశం అనంతరం పాఠశాలలో మండల ప్రత్యేకాధికారిణి, జిల్లా మత్స్యశాఖ డీడీ శ్యామల, ఎంపీడీఓ రాముడు, ఎంఈఓలు జ్యోతి, ఆదామ్‌బాషా.. తదితర అధికారులతో డీఈఓ సమావేశమయ్యారు. డ్రాపౌట్‌ విద్యార్థుల సర్వేపై చర్చించారు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు గ్రామాలలో జీఈఆర్‌ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని డీఈఓ సూచించారు. మండలంలో 63 మంది విద్యార్థులు డ్రాపౌట్స్‌గా ఉన్నారని, అందరినీ పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Published date : 27 Jul 2023 03:43PM

Photo Stories