ఓపెన్ స్కూలు ఫలితాల్లో బాలికలు ముందంజ
జిల్లాలో పదోతరగతి పరీక్షలకు 926 మంది హాజరుకాగా వారిలో బాలికలు 463 మందికి గాను 292 మంది, బాలురు 463 మందికి గాను 204 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ఇంటర్ పరీక్షలకు 2072 మంది హాజరైతే బాలికలు 747 మందికి గాను 444 మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 1325 మంది హాజరై 619 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. జిల్లాలో పదోతరగతి ఉత్తీర్ణత శాతం 53.56 శాతం కాగా, ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత శాతం 51.30 శాతంతో రాష్ట్రంలో పదో తరగతిలో 18వ స్థానం, ఇంటర్మీడియేట్‌లో 20వ స్థానంలో నిల్చిందన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి ఆగస్టు నాల్గవ తేదీ వరకు ఏపీటీ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూన్ 26 నుంచి జూలై నాలుగు వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలకు మార్కుల మెమోలను www.apope nrchoo.ap.gov.inలో పొందుపర్చారన్నారు. 2023–24 విద్యాసంవత్సరానికి జూలై 26 నుంచి ఆగస్టు 31వరకు అడ్మిషన్లు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. దీనికి సంబంధించి ఈ విద్యాసంవత్సరం నుంచి అభ్యర్థులకు పాఠ్యపుస్తకాలు, మార్కుల మెమోలు, పాస్ సర్టిఫికేట్లు నేరుగా వారి చిరునామాలకు పంపుతామని తెలిపారు. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఏపీఓఎస్‌ఎస్.. జ్ఞానధార ప్రత్యేక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారన్నారు. దీనిలో 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఉపయోగకరమైన పాఠ్యాంశాల వీడియోలను పొందుపర్చారన్నారు. అభ్యాసకులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని డీఇవో శామ్యూల్, జిల్లా కో ఆర్డినేటర్ హుస్సేన్ తెలియచేశారు.