Water Break: పాఠశాలల్లో వాటర్ బ్రేక్ అమలు..
మదనపల్లె సిటీ: పాఠశాలల్లో సమయ పాలన పాటించేందుకు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు విద్యాశాఖ ముందు జాగ్రత్తలు చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గత ఏడాదితో పోల్చితే రెండు,మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయానికి విద్యార్థులు తాగునీరు తాగే విధంగా వాటర్‌బెల్ విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తోంది.
APRCET 2023-24 Schedule: ఏపీ ఆర్ సెట్ షెడ్యూల్ విడుదల
అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో వాటర్‌బెల్స్‌ను అమల్లోకి తీసుకువచ్చారు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్ విధిగా వాటర్‌బెల్స్ పాటించే విధంగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసి, అమలుకు జిల్లా, మండల స్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించింది. విద్యార్థులు నీటిని తాగేందుకు వీలుగా రోజులో మూడు సార్లు వాటర్‌బెల్ మోగించాల్సి ఉంటుంది.
NEET & IIT Free Coaching: నీట్, ఐఐటీపై 30 రోజుల ఆన్‌లైన్ క్లాసులు
ఉదయం 8.45 గంటలకు, తిరిగి 10.45, చివరగా 11.50 గంటలకు వాటర్‌బెల్ మోగించి, విద్యార్థులు నీరు తాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తద్వారా విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్‌కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఉత్తర్వులననుసరించి జిల్లాలోని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలల్లో వాటర్‌బెల్ కార్యక్రమం అమలు చేస్తున్నారు.
School Text Books: పాఠ్యపుస్తకాల్లో ఆ పదాలు తొలగింపు.. కారణం ఇదే..