Today and Tomorrow Schools Holidays 2023 : నేడు, రేపు స్కూల్స్‌కు సెలవులు.. ఎందుకంటే..?
మరో వైపు పండుగల సందర్భంగా కూడా విద్యా సంస్థలకు భాగానే సెలవులు వచ్చాయి. తాజాగా తెలంగాణలోని విద్యాసంస్థలకు వరుసగా మరో రెండు రోజులు పాటు సెలవులు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 14,15వ తేదీల్లో (గురువారం, శుక్రవారం) తెలంగాణలోని విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. తెలంగాణ వరుసగా వివిధ పోస్టులకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఇందులో తెలంగాణ టెట్ (TS TET) కూడా పరీక్ష జరగనుంది. కనుక టెట్ పరీక్ష నేపథ్యంలో.. ఎగ్జామ్ సెంటర్స్ పడిన స్కూళ్లకు మాత్రమే ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
ఆ స్కూల్స్‌కు మాత్రమే..
టెట్ సెంటర్లలో మాత్రమే సెప్టంబర్ 14వ తేదీన (గురువారం) హాఫ్ డే స్కూల్ నిర్వహించనున్నారు. ఇక పరీక్ష జరిగే రోజు సెప్టెంబర్ 15వ తేదీన(శుక్రవారం) ఆయా స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
2023-24లో సెలవుల పూర్తి వివరాలు ఇవే..:
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు
Tags
- Today and Tomorrow Schools Holidays 2023 news
- Today Schools Holidays 2023
- Tomorrow Schools Holidays 2023 news in telugu
- Telangana
- Schools
- school holidays
- due to tet exam schools holidays in telangana
- due to tet exam schools holidays
- Schools and Colleges Holidays 2023
- ts students holidays news 2023
- Government Holidays