Technology for Innovation: ఉపాధ్యాయులు బోధనలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్‌ను వినియోగించాలి
సంబేపల్లె: బోధనలో నూతనత్వం కోసం సాంకేతికతను జోడించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెఢ్డి అన్నారు. మంగళవారం ఉదయం సంబేపల్లె మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ప్రిన్సిపల్ సెక్రటరీ వెబెక్స్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడుతూ డిజిటల్ విద్యా విధానం వలన బోధనతోపాటు అభ్యసనం కూడా సులభం అవుతుందన్నారు.
AP Schemes: ఆధునికీకరించిన హాస్టల్ భవనం
అందుకోసం ప్రభుత్వం అందించిన ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్‌ను ఉపయోగించి ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు ట్యాబ్‌లను వినియోగించే సమయం ఎక్కువగా ఉండాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండటం, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
openschool 2024 :పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మడితాటి నరసింహారెఢ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, ఎంఈఓ రమాదేవి, సమగ్ర శిక్ష ఏఎస్‌ఓ సుధాకర్, డిజిటల్ వింగ్ జిల్లా నోడల్ అధికారి అశోక్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.