Skip to main content

AP Schemes: ఆధునికీకరించిన హాస్టల్‌ భవనం

నాడు-నేడు పథకంలో భాగంగా ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఈ హాస్టల్‌ను విద్యార్థినులకు అనుగుణంగా అభివృద్ధి చేశారు.
Development of hostel at Andhra University with Nadu Nedu Scheme

అనకాపల్లి: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో రూ.30 లక్షల నిధులతో ఆధునికీకరించిన హాస్టల్‌ భవన సముదాయం నాగావళి పేరిట అందుబాటులోకి వచ్చింది. నాడు–నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన ఈ హాస్టల్‌ను మంగళవారం ఉదయం విద్యార్థినులతో వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి ప్రారంభింపజేశారు. కళాశాలలో పెరుగుతున్న విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా అదనపు హాస్టల్‌ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

Black Taj Mahal: ప్రేమకు చిహ్నం.. నల్లరాతి తాజ్ మహల్! అది ఎక్కడుంది?

కొత్త హాస్టల్‌ వసతి అందుబాటులోకి రావడంతో విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం వీసీ విద్యార్థినులతో మాట్లాడారు. అక్కడే టిఫిన్‌ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌, ప్రిన్సిపాల్స్‌ ఆచార్య జి.శశిభూషణరావు పాల్గొన్నారు.

YVU: వైవీయూలో ఉర్దూ దినోత్సవం

Published date : 06 Mar 2024 02:26PM

Photo Stories