YVU: వైవీయూలో ఉర్దూ దినోత్సవం
వైవీయూ: ఉర్దూ మాధ్యమం చదివే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని వైవీయూ పీజీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ ఆచార్య పి.ఎస్ షావల్లి ఖాన్ అన్నారు. వైవీయూలోని హ్యుమానిటీస్ బ్లాక్‌లో ఉర్దూ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉర్దూ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా షావల్లి ఖాన్ మాట్లాడుతూ ఉర్దూను అభ్యసించే వారికి వేమన విశ్వవిద్యాలయం ఒక చక్కటి వేదిక అన్నారు.
Black Taj Mahal: ప్రేమకు చిహ్నం.. నల్లరాతి తాజ్ మహల్! అది ఎక్కడుంది?
ఉర్దూ శాఖ అభివృద్ధికి అందరి సహకారం ఉందని, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్, ఏపీపీఎస్సీ యూపీఎస్సీ వంటి పరీక్షలు రాసి ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చన్నారు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ ఆచార్య తప్పెట రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అరబిక్, పర్షియన్, తుర్కీ భాషల నుంచి ఉర్దూ భాష పుట్టిందన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఉర్దూ భాష క్రియాశీలక పాత్ర పోషించిందని ఉదహరించారు. చరిత్రశాఖ ఆచార్యులు కంకణాల గంగయ్య మాట్లాడుతూ మధ్యయుగంలో ఉర్దూ ప్రాధాన్యం పెరిగిందని చారిత్రక నేపథ్యాన్ని వివరించారు.
AP Education Schemes: నాడు-నేడు పథకంతో అభివృద్ధి చెందిన విద్య
స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ఆచార్య పుత్తా పద్మ మాట్లాడుతూ చరిత్ర, సంస్కృతి, మానవ సంబంధాలు, సమాచారం చేరవేసేందుకు భాష అవసరమన్నారు. 17 నుంచి19 శతాబ్దాల్లో ఉర్దూ భాష అభివృద్ధి జరిగిందని, ఉర్దూ భాష ఇతర భాషల్లో కలిసిపోయిందని వివరించారు. ఉర్దూ శాఖ అధిపతి ఆచార్య కె. రియాజున్నిసా మాట్లాడుతూ క్రమక్రమంగా ఉర్దూ భాష విలువ ప్రాముఖ్యత పెరుగుతోందన్నారు. అనంతరం ఉర్దూ భాషా దినోత్సవం సందర్భంగా పలు పోటీలు నిర్వహించి విజేతలకు అతిథులు బహుమతుల ప్రదానం చేశారు.
SI Paper Leakage: ఎస్‌ఐ పరీక్ష రద్దు! రూ. 2 కోట్లకు ప్రశ్నపత్రం అమ్ముడైనట్లు వెలుగులోకి..
కార్యక్రమంలో చరిత్రశాఖ ఆచార్యులు డా.కె గంగయ్య, తెలుగు శాఖ ఆచార్యులు పి.రమాదేవి, పార్వతి, ఉర్దూ శాఖ అధ్యాపకులు డా ఖాజా పీర్, సర్దార్ ఖాజమైనుద్దీన్, డాక్టర్ నజీమున్నీసా, రెహనా పర్వీన్, సయ్యద్ ఇంతియాజ్ అహ్మద్, విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.
Tenth Class Exam 2024:పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు చకాచకా ఏర్పాట్లు....