School Inspection: పాఠశాలలో ఆకస్మివ తనిఖీలు, అధికారులకు ఆదేశాలు
సాక్షి ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థులపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి.నాగరాజు ఆదేశించారు. గురువారం బుక్కరాయ సముద్రం మండలం రోటరీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జగనన్న గోరుముద్ద–మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలకు రుచికరమైన, పౌష్టికరమైన ఆహారం ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శించకూడదని ఆదేశించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘జగనన్న గోరుముద్ద’ను తీసుకొచ్చిందన్నారు.
Medical College: జనగామ మెడికల్ కళాశాలలో 63 మంది చేరిక
ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు షూ లేకుండా ఉండడాన్ని డీఈఓ గమనించారు. ప్రతి విద్యార్థీ యూనిఫాంతో పాటు షూ, టై, బెల్ట్ ధరించేలా హెచ్‌ఎం, ఉపాధ్యాయులు చూడాలని ఆదేశించారు. విద్యార్థుల వర్క్‌బుక్‌లను పరిశీలించారు. సబ్జెక్టు టీచర్లు వారివారి సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులతో వర్క్‌బుక్‌లు రాయించాలని సూచించారు. లెసన్ ప్లాన్‌తోనే పాఠశాలకు రావాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తే కచ్చితంగా ఆశించిన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.