Skip to main content

State Level Competitions: రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ఎంపిక‌..

జిల్లా స్థాయిలో క్రీడ‌లో విద్యార్థులు పాల్గొని వారి ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చారు. ఈ పోటీల్లో సత్తా చాట‌గా, వారిని రాష్ట్ర‌స్థాయికి ఎంపిక చేశారు. ఇంత‌కి ఆ క్రీడ ఎంటి? ఇంక రాష్ట్ర‌స్థాయి వివ‌రాల‌ను తెలుసుకుందాం..
Association members with the selected players, state level competitions
Association members with the selected players

సాక్షి ఎడ్యుకేష‌న్: స్థానిక రాజా కళాశాల మైదానంలో సోమవారం టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ జిల్లా జట్లను ఎంపిక చేసినట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జి.విక్టర్‌బాబు తెలిపారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 150 మంది బాలురు, బాలికలు హాజరయ్యారు. బాలురు, బాలికల అండర్‌–14 విభాగంలో వారి ప్రతిభ ఆధారంగా జిల్లా జట్లను ఎంపిక చేశారు.

Football Competitions: జిల్లాస్థాయిలో గెలిచి రాష్ట్ర స్థాయిలో పోటీ

వీరు ఈ నెల 16, 17 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కలిదండి సత్యనారాయణరాజు అభినందించారు. వ్యాయామ ఉపాధ్యాయులు పి.ప్రశాంత్‌కుమార్‌, వరలక్ష్మి, సాధన, పరదేశమ్మ, నరసింహ, శ్రీనివాస్‌, కృష్ణ, పాపారావు పాల్గొన్నారు.

Published date : 03 Oct 2023 02:31PM

Photo Stories