Commissioner of School Education: విజ్ఞానశాస్త్ర ప్రదర్శన(సైన్స్ ఫేర్) రాష్ట్రస్థాయి
2023–24 విద్యా సంత్సరానికి సంబంధించిన పాఠశాలవిద్య కమిషనర్, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాల స్థాయి, మండలస్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు ఈ ఏడాది వైఎస్సార్ జిల్లాలో నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోస్టర్‌ను డిసెంబర్ 4న తన కార్యాలయంలో డిప్యూటీ డీఈఓ రాజగోపాల్‌రెడ్డి, కడప ఎంఈఓ పాలెం నారాయణ, జిల్లా సైన్సు అధికారి మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి డీఈఓ ఎద్దుల రాఘవరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాల నుంచి ఎనిమిది అంశాలలో మూడు కేటగిరీలతో విద్యార్థులకు పోటీలు ఉంటాయన్నారు.
చదవండి: SpaceX 250 Rocket: స్పేస్ ఎక్స్ రాకెట్ సేఫ్ ల్యాండ్
ఈ అంశాల పరిధిలోనే పిల్లలు ప్రాజెక్టులను సిద్ధం చేసుకుని రావాల్సి ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 13 లోపల ముగించాలని.. ప్రతి పాఠశాల నుంచి ప్రదర్శన పూర్తి చేసుకుని ఆయా మండల విద్యాశాఖ అధికారులు విజేతల వివరాలను తెలియ పరచాలన్నారు. తదుపరి మండలస్థాయి ప్రదర్శనను 16వ తేదీ లోపల పూర్తి చేసి ప్రతి మండలం నుంచి మూడు కేటగిరీలలో విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా సైన్సు అధికారికి పంపాలన్నారు.
డిప్యూటీ డీఈఓ రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో డిసెంబర్ 19వ తేదీన తన అధ్యక్షతన చాపాడు మండలం పల్లవోలులోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌నందు జిల్లాస్థాయి ప్రదర్శన జరుగుతుందని డీఈఓ ఎద్దుల రాఘవరెడ్డి తెలిపారు.
జిల్లాస్థాయిలో ప్రతి కేటగిరి నుంచి మూడు ప్రాజెక్టుల చొప్పున మొత్తం 9 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనను కడప మరియాపురంలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల మైదానంలో డిసెంబర్ 28, 29 తేదీలలో నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం జిల్లా సైన్సు అధికారి మహేశ్వరెడ్డిని 9441035830 నంబరులో సంప్రదించాలని డీఈఓ రాఘవరెడ్డి తెలిపారు.