NMMS : ఉన్నత విద్యకు ఎన్ఎంఎంఎస్!
సత్తెనపల్లి: పేదరికం చదువుకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు భరోసా కల్పిస్తోంది. ఎనిమిదో తరగతిలో డ్రాపౌట్స్ నివారించేందుకు ఏటా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్‌ఎంఎంఎస్)తో ప్రోత్సహిస్తుంది. ఎంపిౖకైన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ. 12 వేల చొప్పున మొత్తం రూ. 48 వేలను ఉపకార వేతనాల రూపంలో ప్రభుత్వం అందజేస్తుంది. ఇందులో భాగంగా 2024–25 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానిస్తుంది.
KGBV Jobs: ‘కస్తూరిబా’లో ఖాళీల భర్తీ!.. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
జిల్లాలోని మోడల్, ఎయిడెడ్, మున్సిపల్, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో చదువుతున్న 31,532 మంది ఎనిమిదో తరగతి విద్యార్థులు ఉపకార వేతన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా దీన్ని పొందేందుకు అర్హులు. ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్‌కు అర్హత సాధిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 3.50 లక్షల లోపు ఉండాలి.
ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతూ ఏడో తరగతిలో జనరల్, బీసీ కులాలకు చెందిన వారైతే 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ కులానికి చెందినవారు 50 శాతం మార్కులు సాధించాలి. జనరల్, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 50 పరీక్ష ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. www.brc.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 8న రాత పరీక్ష నిర్వహించనున్నారు.
Tags
- NMMS
- Scholarship Exam
- eight class students
- higher education
- National Means Cum Merit Scholarship
- Education Schemes
- Poor Students
- online registrations
- registrations for nmms exams
- deadline for applications
- model and aided schools
- primary and high school students
- quality and higher education of students
- NMMS registrations
- NMMS Scheme
- Education News
- Sakshi Education News