Skip to main content

KGBV Jobs: ‘కస్తూర్బా’లో ఖాళీల భర్తీ!.. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

నిర్మల్‌ రూరల్‌: జిల్లాలోని కస్తూరిబాగాంధీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేజీబీవీలో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు వివిధ నోటిఫికేషకన్ల ప్రకారం.. గురుకులాలు, ఇతరత్రా ఉద్యోగాలలో ఇటీవలే జాయిన్‌ అయ్యారు.
KGBV job vacancy details newsin telugu

దీంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రధాన సబ్జెక్టులకు కూడా తగినంత బోధకులు లేకపోవడంతో బోధన అంతంత మాత్రంగానే సాగుతోంది. దీంతో బాలికావిద్య కుంటుపడకుండా ఉండేందుకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల భర్తీపై కసరత్తు చేపట్టారు. ఈ నియామకాలు 2023లో నిర్వహించిన పరీక్షలో మిగిలిన అభ్యర్థులను భర్తీ చేస్తారు.

జిల్లాలో 34 ఖాళీలు...

జిల్లాలోని కేజీబీవీల్లో 34 అధ్యాపకుల ఖాళీలు ఉన్నట్లు అధికారులు లేక్క తేల్చారు. ఈ సమాచారం రాష్ట్ర డైరెక్టర్‌ కార్యాలయానికి అందించారు. ఇప్పటికే హైదరాబాదులోని రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయంలో జెండర్‌ ఈక్వెంట్‌ కోఆర్డినేటర్‌ (జేఈసీఓ), ఎస్‌వోలతో సెప్టెంబ‌ర్ 12న సమావేశం జరిగింది. జిల్లాలో పోస్టుల భర్తీపై ఈ సందర్భంగా అధికారులు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు.

చదవండి: KGBV Jobs: కాస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఉద్యోగాలు

2023 జూలై నెలలో నిర్వహించిన పరీక్షలో మిగిలిన అభ్యర్థులను మెరిట్‌, రోస్టర్‌ ప్రకారం ఖాళీల్లో భర్తీ చేస్తారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో సన్నాహాలు పూర్తయ్యాయి. మొదట 37 పోస్టులు ఖాళీలు ఉండగా ఇటీవల జరిగిన బదిలీల్లో ఇతర జిల్లాల నుంచి మూడు పోస్టులు భర్తీ అయ్యాయి. మిగిలిన 34 పోస్టులను రోస్టర్‌ ప్రకారం, నిబంధనల ప్రకారం భర్తీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ముగిసిన బదిలీల ప్రక్రియ..

కేజీబీవీలో అధ్యాపకుల బదిలీల ప్రక్రియ ఇటీవల ముగిసింది. కేవలం మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దీంతో నామమాత్రంగానే ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు.

జిల్లాలో ఐదుగురు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ కాగా, మన జిల్లా నుంచి ఇతర జిల్లాలకు ముగ్గురు బదిలీ అయ్యారు. ఇతర జిల్లా నుంచి నిర్మల్‌ జిల్లాకు ఆరుగురు బదిలీపై వచ్చారు. మ్యూచువల్‌ కాకుండా సాధారణ ఉపాధ్యాయులకు జరిగే విధంగా బదిలీలు జరిగితే పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులు వేరే చోటికి వెళ్లేవారు.

వివరాలు..

మొత్తం కేజీబీవీలు: 18

విద్యార్థినులు: 6,264

జిల్లాలో ఖాళీలు: 34

పది రోజుల్లో ప్రక్రియ పూర్తి

జిల్లాలోని కేజీబీవీల్లో గుర్తించిన ఖాళీలను మరో పది రోజుల్లోగా భర్తీ చేస్తాం. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ ఉంటుంది. రోస్టర్‌, ఇతర నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తాం. ఖాళీల భర్తీతో బోధన సమస్యలు తొలగి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయి. 
– రవీందర్‌రెడ్డి, డీఈవో

Published date : 16 Sep 2024 05:31PM

Photo Stories