School Holidays: వర్షాలు మళ్లీ వస్తున్నాయి.. నేడు మోస్తరు, రేపు భారీ వర్షాలు
ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయని వివరించింది. జూలై 30న రాష్ట్ర వ్యాప్తంగా 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 35.31 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా... 55.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కాగా జూలై 30న సంగారెడ్డి జిల్లా జన్నారంలో 40.3 మిల్లీమీటర్లు, మేడ్చల్ 37.5, మెదక్ జిల్లా కాగజ్ మద్దూర్ 35, యాదాద్రి జిల్లా బీబీనగర్ 27.5, నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పూర్ 27, సంగారెడ్డి జిల్లా లక్ష్మిసాగర్ 26.8, మేడ్చల్ జిల్లా కేశవరం 26, ఆలియాబాద్ 25, బండ మాదారంలో 24.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
చదవండి: విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి చేయాలి
వర్షాలు తగ్గినా బోధన ఎలా?
పాఠశాల విద్యాశాఖ వివరాల ప్రకారం ఇప్పట్లో సజావుగా బోధన సాగే అవకాశం లేదని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల స్కూళ్లలో కుండపోత వర్షాల వల్ల గదుల్లోకి, స్కూల్ ప్రాంగణాల్లోకి వరదనీరు చేరింది. దాదాపు 3 వేల స్కూళ్ల ఆవరణలో బురద పేరుకుపోయింది. 6,200 స్కూళ్లలో గోడలు చెమ్మపట్టడంతోపాటు విద్యుత్ బోర్డుల్లోకి నీరు చేరింది. 78 శాతం స్కూళ్లలో వర్షాలు తగ్గినా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ హాస్టళ్ల నుంచి చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. బడులు తెరిచినా గ్రామీణ ప్రాంతాల్లో చాలాచోట్ల రవాణా వ్యవస్థ దెబ్బతిన్నందువల్ల వారంపాటు వారు తిరిగి రావడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో డెంగీ, మలేరియా, అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. తాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందువల్ల స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై మండలస్థాయి ప్రకారం నివేదికలు తెప్పించుకోవాలని సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు.