విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి చేయాలి
వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ నాయకులు ఆదివారం ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారిని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో అభ్యసనా సామర్‌ాధ్యలు పెంపొందించడం కోసం ఉపాధ్యాయులు నూతన బోధనా పద్ధతులు అవలంభించాలని కోరారు. ఉపాధ్యాయుల బోధనా సామర్‌ాధ్యల పెంపుకోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొని నూతన బోధనా విధానాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడానికి, తద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపడానికి అంకితభావంతో పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ టీఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. శ్యామ్ సుందర్‌ను కలిసిన వారిలో వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు జీజే ప్రభువరం, గౌరవ అధ్యక్షుడు బొడ్డేటి రాధాకృష్ణ, ఉపాధ్యక్షుడు పీవీ సత్యనారాయణ, కార్యదర్శి రాబర్ట్ మాథ్యూ, ఏలూరు జిల్లా పెదపాడు మండల అధ్యక్ష, కార్యదర్శులు కాటి వెంకట రమణ, ప్రకాష్ రాజ్, ఏలూరు మండల అధ్యక్షుడు పిట్ట ఫ్రెడ్రిక్ బాబు, అత్తిలి గ్రామ సర్పంచ్ గంట విజేత నాగరాజు, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జీజేఏ స్టీవెన్ ఉన్నారు.