Computer Science: ఈ ప్రోగ్రాంతో విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలు..!
వెనక బాటు జిల్లాలుగా ఉన్న ఈ ప్రాంత భవిష్యత్తు సారథులైన విద్యార్థులకు ప్రభుత్వం ఈ గొప్ప అవకాశం కల్పిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరం నాటికి 10 వేల మంది ఏపీ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ విద్యతో సాధికారత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్ ఇండియాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
Jobs in Indian Army- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..
2026–27 నాటికి సంపూర్ణంగా ఈ ప్రయోజనాలను లక్ష మందికి అందించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా విజయవాడలో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు సమక్షంలో ఒప్పంద సంతకాలు జరిగాయి. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యంతో..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఈ బృహత్తర కార్యానికి అనేక సంస్థలు మందుకువచ్చాయి. అమెజాన్ ఇండియా ఫండ్స్, సమగ్ర శిక్షతో పాటు ప్రపంచబ్యాంక్ టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్, లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ, క్వెస్ట్ అలయన్స్ అనే ఎన్‌జీవో ఇందులో ఉన్నాయి. వీరందరి భాగస్వామ్యంతో ఉత్తరాంధ్ర విద్యార్థుల భవితను తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ‘కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ 21 సెంచరీ స్కిల్స్’పై శిక్షణా కార్యక్రమం ద్వారా తరగతి గదుల్లో కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలను సమర్థవంతంగా అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేవలం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా బోధన, సాంకేతిక, నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు.
Open Exams: వచ్చే నెల టెన్త్, ఇంటర్ పరీక్షలు.. తేదీలు విడుదల..
10 వేల మంది నుంచి లక్ష వరకూ..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యేలా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఉత్తరాంధ్రలో 10 వేల మంది విద్యార్థులకు ఈ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో లక్ష మందికి ఈ విద్యను చేరువ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎస్సీఈఆర్టీతో కలిసి పాఠశాలల్లో కంప్యూటేషనల్ థింకింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేయనుంది. విద్యార్థులకు కంప్యూటర్ సై న్స్ పాఠాల బోధన, ప్రాక్టికల్‌గా శిక్షణ ఇలా విభిన్న అంశాల్లో తరగతులు నిర్వహించి పిల్లల్ని నిష్ణాతుల్ని చేయనుంది.
Group-1 Notification: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల.. ఎప్పుడంటే..!
ఎక్సలెన్స్ కోర్సుల అనుసంధానం
కంప్యూటర్ సైన్స్ టీచింగ్ ఎక్సలెన్స్ కోర్సులను అనుసంధానం చేయడం ద్వారా డిజిటల్ యుగానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేస్తున్నాం. దీనివల్ల విద్యార్థుల ఉన్నత చదువులకు ఈ ప్రోగ్రాం ఒక పునాదిలా మారుతుంది.
– బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్
NTA GAT-B/BET 2024 Notification- జీఏటీ–బీ)/బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 నోటిఫికేషన్ విడుదల
ప్రతి విద్యార్థికి అవకాశం
అమేజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులందరినీ సాంకేతిక విద్యను చేరువ చేయాలన్నదే అమేజాన్ ఇండియా లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో అడుగులు వేస్తున్నాం. విద్యార్థులకు వారి కెరీర్‌లకు అవ సరమైన నైపుణ్యాల్ని అందిస్తాం. బెస్ట్ కెరీర్‌కు కంప్యూటర్ సైన్స్ విద్య ఎంతో దోహద పడు తుంది. రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 1.5 మిలి యన్ మంది విద్యార్థులకు, 8 వేల మంది టీచర్లకు కంప్యూటర్ సైన్స్ విద్య అందించాం.
– అక్షయ్ కశ్యప్, అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ ఇండియా లీడర్