Skip to main content

Navodaya Admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు అర్హత, చివరి తేదీ ఇదే..

Jawahar Navodaya Vidyalaya in Marripadu invites applications for Class 6 admission  Applications open for Class 6 at Krishnapuram Jawahar Navodaya Vidyalaya  Krishnapuram Jawahar Navodaya Vidyalaya admissions for Class 6  Navodaya Admissions Navodaya Vidyalaya Samiti Class 6 Admissions JNV 6th Class Admissions 2025-26

మర్రిపాడు: మండలంలోని కృష్ణాపురం జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యాసంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ పీ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. దరఖాస్తులు పంపే విద్యార్థులు 01.05.2013 నుంచి 31.07.2015 తేదీల మధ్య పుట్టిన వారై ఉండాలన్నారు.

Job Mela In Government Polytechnic College: గుడ్‌న్యూస్‌, రేపు జాబ్‌మేళా.. నెలకు రూ.20వేల వేతనం

ప్రభుత్వ పాఠశాలలో లేదా ప్రభుత్వ గుర్తింపు పాఠశాలలో చదివి ఉండాలన్నారు. ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తులు కేవలం ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరిస్తామని, ఆన్‌లైన్‌లో పంపే వీలు లేకుంటే విద్యాలయంలో సమర్పించవచ్చునని తెలిపారు. దరఖాస్తులు పంపేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

CAPF Recruitment 2024: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్సెస్‌లో ఉద్యోగాలు.. ఇదే చివరి తేది

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సీట్లు కేటాయింపు ఉంటుందన్నారు. 6వ తగరతిలో ప్రవేశానికి అర్హత లభిస్తే జనన ధ్రువీకరణ పత్రం విద్యాలయ కార్యాలయంలో అందజేయాలన్నారు. ప్రవేశ పరీక్ష 2025 జనవరి 18న నిర్వహిస్తామని, వివరాలకు విద్యాలయంలో సంప్రదించాలని కోరారు.
 

Published date : 09 Sep 2024 01:23PM

Photo Stories