Skip to main content

Anganwadis Services: అంగన్‌వాడీల సేవలు వెలకట్టలేం

వీపనగండ్ల: గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆయాల సేవలు వెలకట్టలేమని జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌కుమార్‌ అన్నారు.
Anganwadis services cannot be charged  Rural Anganwadi center with basic infrastructure for early education

అక్టోబర్ 9న మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ ఉత్సవాలు, బతుకమ్మ సంబరాల కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులకు ప్రాథమికస్థాయిలో అంగన్‌వాడీ ఉపాధ్యాయులు నేర్పిన అక్షరాలే వారి భవిష్యత్‌కు పునాదులు వేస్తాయని వివరించారు. జిల్లాలోని కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

చదవండి: Anganwadi Posts : స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ పోస్టులు

అనంతరం సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. వివిధ రకాల పువ్వులతో తయారుచేసిన బతుకమ్మలు ఉంచి కోలాటాలు, బొడ్డెమ్మలు వేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ లక్ష్మమ్మ, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రాణి, పలువురు సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 10 Oct 2024 05:16PM

Photo Stories