Children Fitness:ఈ సర్వే ప్రకారం బడి విద్యార్థుల శారీరక ధృఢత్వం..! ఇవే కీలక విషయాలు..
బడికి వెళ్ళే పిల్లలకు మానసిక ఉల్లాసంతోపాటు శారీరక ఉల్లాసం కూడా ముఖ్యమే. వారికి ఆటలు అలవాటు చేయడం, నేర్పించడంతో మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా ఇటు ఆరోగ్యంగానూ ఉండగలరు.
తాజాగా భారత్‌లోని చాలా వరకు పాఠశాల విద్యార్థుల్లో ఫిట్‌నెస్ స్థాయిలు(శారీరక ధృఢత్వం) తక్కువగా ఉన్నట్లు పోర్ట్జ్ విలేజ్ ఫౌండేషన్ 12వ వార్షిక ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. ఆరోగ్యంపరంగా చాలా వెనకబడి ఉన్నట్లు తేలింది. దేశవ్యాప్యంగా 250 నగరాల్లో ఏడు నుంచి 17 సంవత్సరాల వయసున్న పిల్లలను సర్వే చేస్తే ఈ విషయాలు వెల్లడయ్యాయి. బాడీ మాస్ ఇండెక్స్ (BMI), ఏరోబిక్ కెపాసిటీ, వాయురహిత కెపాసిటీ, కోర్ స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, అప్పర్ బాడీ స్ట్రెంత్, లోయర్ బాడీ స్ట్రెంత్ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఈ సర్వే చేపట్టారు.
AP Anganwadi Workers : విధుల్లోకి చేరిన అంగన్‌వాడీ కార్యకర్తలు.. ఇంకా 1413 మంది..
పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ కీలక పాత్ర పోషిస్తుందని సర్వే ద్వారా వెల్లడైంది. స్కూళ్లో వారంలో రెండు కంటే ఎక్కువ సార్లు ఆటల్లో చురుగ్గా పాల్గొనే పిల్లల్లో శారీరక దృఢత్వం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. శరీరం కింద భాగం, పొట్ట భాగం, ఫ్లెక్సిబిలిటీ, ఏరోబిక్ కెపాసిటీ వంటి కీలకమైన అంశాలలో మెరుగుదల కనిపిస్తోంది. ఇవన్నీ క్రీడల ప్రాముఖ్యత, సానుకూల ప్రభావాన్ని నొక్కి చెబుతున్నాయి. ఈ పరిశోధనలన్నీ పిల్లల రోజువారీ దినచర్యలో శారీరక శ్రమను పెంచడం ద్వారా వారి సంపూర్ణ శ్రేయస్సుకు దోహదపడుతుందనే విషయాన్ని తెలియజేస్తుది.
Gurukula School Admissions: గురుకుల పాఠశాలలో దరఖాస్తులు
వార్షిక ఆరోగ్య సర్వేలో కనుగొన్న విషయాలపై స్పోర్ట్జ్ విలేజ్ సీఈఓ సౌమిల్ మజ్ముదర్ మాట్లాడుతూ.. స్పోర్ట్జ్ విలేజ్ ద్వారా, క్రీడలతో పిల్లల జీవితాలను మార్యాలనే తమ లక్ష్యానికి కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు క్రీడలను విద్యలో అంతర్భాగంగా చూడాలని కోరారు. పిల్లలు శారీరక శ్రమలలో పాల్గొనడానికి అవకాశాలను అందించాలని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. పిల్లలకు క్రీడలు అవసరం లేదనే ఉద్ధేశ్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు. దీంతో శారీరక శ్రమకు ఎక్కువ సమయం కేటాయించకపోవడం వల్ల పిల్లల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందన్నారు. శారీరక శ్రమ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఆరోగ్యం, విద్యా పనితీరుపై ప్రభావం చూపుతుందని వివిధ అధ్యయనాలు చూపిస్తున్నాయని తెలిపారు.
Latest Jobs: 108లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
వెల్లడైన కీలక విషయాలు,
►భారతదేశంలో మొత్తం 73,000 మంది పిల్లలను సర్వే చేశారు.
►ఐదుగురిలో ఇద్దరు పిల్లలకు ఆరోగ్యకరమైన BMI లేదు.
►ఐదుగురిలో ఇద్దరు పిల్లలు కోరుకున్న వాయురహిత సామర్థ్యాన్ని(Anaerobic Capacity) కలిగి లేరు
►నలుగురు పిల్లల్లో ముగ్గురికి కావలసిన ఏరోబిక్ కెపాసిటీ లేదు.
►ముగ్గురు పిల్లల్లో ఒకరికి కావలసిన ఉదర లేదా కోర్ బలం లేదు.
►ఐదుగురు చిన్నారుల్లో ముగ్గురికి తగినంత ఎగువ శరీరం, దిగువ శరీర బలం లేదు.
సర్వే ప్రకారం అబ్బాయిలతో పోల్చినప్పుడు ఆరోగ్యకరమైన BMI స్థాయిలు (62%) బాలికల్లో ఎక్కువశాతం ఉన్నట్లు తేలింది. అమ్మాయిలు ఫ్లెక్సిబిలిటీ, అప్పర్ బాడీ స్ట్రెంత్‌లో కూడా మెరుగ్గా ఉన్నారు. అయితే వారు ఏరోబిక్ కెపాసిటీ, లోయర్ బాడీ స్ట్రెంత్‌లో బలహీనంగా ఉన్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల (31%) పిల్లలతో పోల్చితే, ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలు మెరుగైన శరీర బలాన్ని (43%) కలిగి ఉన్నారని సర్వే వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల పిల్లలు BMI, ఏరోబిక్ కెపాసిటీ, ఫ్లెక్సిబిలిటీలో మెరుగ్గా ఉన్నారు.