Skip to main content

Ayodhya Ram Mandir Inauguration Updates 2024 : కేంద్రం కీలక ప్రకటన.. అన్ని కార్యాలయాలకు హాలీడే.. కానీ..

సాక్షి ఎడ్యుకేష‌న : అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. జ‌న‌వ‌రి 22వ తేదీన హాలీడే ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
ayodhya ram mandir inaugurated highlights 2024

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలన్నింటికి ఈ హాఫ్‌ హాలీడే వర్తించనున్నట్లు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో జరిగే రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయ్యేంత వరకు ఒకపూట సెలవు వర్దిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే దేశంలోని వివిధ ప్రైవేట్‌ ఆఫీస్‌ల‌కు ఆయా సంస్థ‌లు సెల‌వులు ఇస్తున్నాయి. అలాగే ఆ రోజు పలు రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఏ రాష్ట్రాల్లో జ‌నవ‌రి 22న పాఠశాలలకు సెలవులు ప్రకటించారంటే..

ఉత్తరప్రదేశ్‌..
ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 22న పాఠశాలలకు సెలవుపై ఆదేశాలు జారీ చేశారు. జనవరి 22న రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలతో పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేస్తున్నట్లు యోగి తెలిపారు. ఆ రోజున ఏ విద్యా సంస్థలనూ తెరవరు.

మధ్యప్రదేశ్ :
మధ్యప్రదేశ్‌లోనూ పాఠశాలలు, కళాశాలలకు 22న సెలవు ప్రకటించారు. ఈమేరకు ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పెద్ద పండుగలాంటిదని సీఎం పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. 

గోవా :
22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గోవా ప్రభుత్వం..  ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలకు, కళాశాలలకు సెలవు ప్రకటించింది.

ఛత్తీస్‌గఢ్ :
ఛత్తీస్‌గఢ్‌లో కూడా జనవరి 22న పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది.

హర్యానా :
హర్యానాలో కూడా రామ్‌లల్లా పవిత్రోత్సవంనాడు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఆ రోజున మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Published date : 19 Jan 2024 01:19PM

Photo Stories