Skip to main content

Ayodhya Ram Mandir Inauguration Live Update 2024 : అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు జ‌న‌వ‌రి 22వ తేదీన సెల‌వు.. అలాగే వీరికి కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : జ‌న‌వ‌రి 22వ తేదీన‌ అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ‌ప్ర‌తిష్ట సంద‌ర్భంగా.. దేశవాప్తంగా చాలా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులను ప్ర‌క‌టించారు ఆయ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు. ఉత్తరప్రదేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలోని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే.
Chief Ministers Declare Holiday on 22nd Jan for Ram Temple Event   Schools and Colleges Holidays  Yogi Adityanath Announces School and College Holidays on 22nd January

ఇప్పుడు తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, హ‌రియాణాలో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఇచ్చారు. అలాగే ఆయ‌రాష్ట్రాల్లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు కూడా సెల‌వులు ఇస్తున్నాయి. గోవా రాష్ట్రంలోని స్కూల్స్‌, కాలేజీల‌తో పాటు.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కూ కూడా హాలిడే ప్ర‌క‌టించారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లోని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చి అవ‌కాశం ఉంది. దీని తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అలాగే ఇత‌ర రాష్ట్రాల ప్ర‌భుత్వాలు జ‌న‌వ‌రి 22వ తేదీ స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇంకా దీని ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లే. కొన్ని హిందూ సంఘాలు జ‌న‌వ‌రి 22వ తేదీన స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవ్వ‌ల‌ని డిమాండ్ చేస్తున్నారు.

 Ayodhya Ram Mandir Live Updates 2024 : అయోధ్య రామ జన్మభూమి కేసులో..ఒకేఒక్క‌డు.. కళ్లు ఉండి చేయలేని పనిని.. కళ్లు లేని ఈ స్వామీ..

☛ AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా..

pm modi

అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ‌ప్ర‌తిష్ట ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి 4000 మంది సాధువులను, 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించారు. కాశీ విశ్వనాథుని ఆలయం, మాతా వైష్ణో దేవి ఆలయ ప్రతినిధులు, ఇస్రో శాస్త్రవేత్తల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. ప్రముఖ సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపారవేత్తలకు కూడా ఆహ్వానాలు పంపారు.

 Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?

2024లో సెల‌వులు ఇవే..

school holidays news telugu

☛ 15-01-2024న (సోమవారం) సంక్రాంతి
☛ 16-01-2024న (మంగళవారం) కనుమ
☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

Published date : 19 Jan 2024 10:44AM

Photo Stories