Skip to main content

PM Modi: బ్రూనైలో భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని ప్రారంభించిన మోదీ

ప్ర‌ధానమత్రి న‌రేంద్ర మోదీ సెప్టెంబ‌ర్ 3వ తేదీ బ్రూనై వెళ్లారు.
PM Narendra Modi inaugurates new chancery premises of Indian High Commission in Brunei

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మ‌ధ్య ఉన్న 40 ఏళ్ల దౌత్య సంబంధాల‌ను బ‌లోపేతం చేయ‌నున్నారు.

అక్క‌డికి చేరుకున్న మోదీ బంద‌ర్‌సేరీ బేగావాన్ సిటీలో భార‌త నూత‌న రాయ‌బార కార్యాల‌యాన్ని ప్రారంభించారు. అక్క‌డి ఇండియ‌న్ హైక‌మిష‌న్ ప్రాంగ‌ణంలో దీనిని ప్రారంభించారు. ఈ కార్యాల‌యం భార‌త్, బ్రూనైల బ‌ల‌మైన బందానికి సంకేత‌మ‌ని మోదీ అన్నారు. 

ఆసియ‌న్ స‌ద‌స్సు కోసం 2013లో నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ బ్రూనైలో ప‌ర్య‌టించ‌గా.. దౌత్మ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భారత ప్రధాని ఒక‌రు బ్రూనై పర్యటించ‌డం ఇదే తొలిసారి. 

PM Modi Poland Visit: పోలెండ్‌లో పర్యటించిన మోదీ.. ఆ దేశ ప్రధానితో సమావేశం.. ద్వైపాక్షిక అంశాలపై చర్చ

Published date : 04 Sep 2024 03:41PM

Photo Stories