Skip to main content

Latest Jobs: 108లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Latest Jobs news     Emergency Medical Technician  position Joint Warangal District 108 Services Program
Latest Jobs news

108 ఈ ఎంఆర్‌ఐ గ్రీన్‌ హెల్త్‌ సర్వీసెస్‌లో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ (ఈఎంటీ) ఉద్యోగాల కోసం ఆసక్తి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా 108 సేవల ప్రోగ్రాం మేనేజర్‌ శివకుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బీఎస్సీ (లైఫ్‌ సైన్స్‌, నర్సింగ్‌, ఎంఎల్‌టీ), బీఎస్‌ఎం, ఏఎస్‌ఎం చదివిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 19న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగే ఇంటర్వ్యూ లకు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌, ఒక జిరాక్స్‌ సెట్‌ కాపీతో హాజరుకావాలని వివరించారు.

ఎంపికై న అభ్యర్థులు మొదటి మూడు నెలలు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 91007 99258 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Published date : 19 Jan 2024 09:39AM

Photo Stories