Skip to main content

AP Education: ఏపీ విద్యాను ప్ర‌శంసించిన ఆస్ట్రేలియన్ సీఈఓ

ఆస్ట్రేలియా నుంచి వ‌చ్చిన ఓ సీఈఓ, ఏపీ రాష్ట్ర విద్యా విధానం గురించి ప‌రిశీలించారు. త‌మ హ‌ర్షం వ్య‌క్తం చేసి, విద్యార్థుల‌కు త‌మ వంతు ప్రోత్సాహాన్ని అందించారు.
CEO Impressed by AP State's Education System, Raquel Froff visits Gurukul school and speaks to students,Australian CEO
Raquel Froff visits Gurukul school and speaks to students

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానం చాలా బాగుందని, ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆస్ట్రేలియా గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సొల్యూషన్స్‌ సీఈవో రాక్వెల్‌ ఫ్రాఫ్‌ అన్నారు. ఆమె శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు.

Civils Achievement: తండ్రి ఆశ‌యాన్ని విజ‌యవంతం చేసిన కుమార్తె

డీఈవో వీఎస్‌ సుబ్బారావు, పరిషత్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌(పీఈవో) సోమా సుబ్బారావుతో కలిసి జిల్లాలోని పలు పాఠశాలలు, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం, రామచంద్ర మిషన్‌ను రాక్వెల్‌ ఫ్రాఫ్‌ సందర్శించారు.

Placement Job for Student: ఇంజ‌నీరింగ్ విద్యార్థినికి ప్లేస్మెంట్లో ఉద్యోగం.... ప్యాకేజీ ఎంత‌?

నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో అభివృద్ధి, విద్యార్థులకు అందించిన యూనిఫాం, షూ, పుస్తకాలు, కేరీర్‌ గైడెన్స్, ఇంగ్లిష్‌ మీడియంలో బోధన, మార్గదర్శినిపై విద్యాశాఖ చేస్తున్న కసరత్తును పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త రూపు సంతరించుకోవడంపై ఆమె హర్షం వ్యక్తంచేశారు. ముందుగా ఆమెకు విద్యాశాఖ అధికారులు, రోటరీ క్లబ్‌ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

Published date : 25 Sep 2023 12:18PM

Photo Stories