Civils Achievement: తండ్రి ఆశయాన్ని విజయవంతం చేసిన కుమార్తె
ఆలేరు మున్సిపాలిటీ 3వ వార్డు ఆదర్శ్‌నగర్‌కు చెందిన స్వామి, ఆండాలు దంపతులకు మౌనిక సంతానం. స్వామి ఆలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ అంటెండర్‌గా పని చేస్తున్నాడు. తల్లి టైలరింగ్ చేస్తుంది.
APPSC Rankers: గ్రూప్-1 ఫలితాల్లో ర్యాంకులు సాధించిన యువతీ యువకులు
తల్లిదండ్రులు తనను కష్టపడి చదివించినా, తన తెలివితో, కష్టంతో ఎమ్మెస్సీ పూర్తి చేసింది ఈ యువతి పేరు మౌనిక. తన చదువు పూర్తి అయిన తరువాత తనకు ఓ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం లభించింది. తను ఉద్యోగంలో ముందుకెళుతూ ఉండగా.. తన తండ్రి ఆశ మెరకు తాను సివిల్స్ లో విజయం సాధించాలి అని ప్రోత్సాహం పొంది, మరింత ముందుకు వెళ్ళలన్న పట్టుదలతో తను సివిల్స్ చదవడం ప్రారంభించింది. అలా తన ఉద్యోగ బాధ్యతను, చదువు బాధ్యతను సామానంగా మొస్తూ నడిచింది. ఇందులో తనకు తన తండ్రి తోడై ఆమె చదువులో తనవంతు సహకారాన్ని అందించారు. ఇకపోతే, ఈ అమ్మాయి తన చదువును పీఈటీ పూసలోజు కృష్ణచారి కొచింగ్‌తోనే ఈవెంట్స్‌లో పొందింది. ఇలా ఆ యువతి తన సివిల్స్ పరీక్షలను పూర్తి చేసి మొత్తానికి తొలి ప్రయత్నంలోనే తన తండ్రి గర్వ పడేలా ఎస్ఐ కొలువును సాధించి విజయం అందుకుంది.
Placement Job for Student: ఇంజనీరింగ్ విద్యార్థినికి ప్లేస్మెంట్లో ఉద్యోగం.... ప్యాకేజీ ఎంత?
ఇందులో భాగంగానే తనకు ఎంతోమంది నుంచి ప్రశంసలు దక్కాయి. ఎందరో ఈ యువతి సాధించిన విజయాన్ని అభినందించారు. మౌనిక అనే యువతి ప్రయాణం ఎందరికో గొప్ప స్పూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ విజయంలో తను మాట్లాడుతూ.. 'పీఈటీ పూసలోజు కృష్ణచారి కొచింగ్‌తోనే ఈవెంట్స్‌లో రాణించానని, తండ్రి ఆశయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది' అని పేర్కొంది మౌనిక. ఆమెకు దక్కిన అభినందనలకు తన తల్లిదండ్రలు ఎంతో సంతోషపడుతూ.. గర్విస్తున్నారు.