AP Govt Schools Digital Classrooms- పాఠశాలల్లో డిజిటల్ తరగతులు
ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది.
‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది పిల్లలకు అవార్డులు అందించింది.
నాడు అలా..
పెచ్చులూడిన స్లాబులు 4 నెర్రలు బారిన గోడలు
విరిగిపోయిన బెంచీలు 4 కటిక నేలపై చదువులు
వస్తారో రారో తెలియని అయ్యవార్లు
మచ్చుకైనా కనిపించని వాష్ రూమ్‌లు
కొన్ని చోట్ల పశువులకు నెలవు
ఎక్కడో ఒక చోట మాత్రమే టీవీలు
సబ్జెక్ట్ టీచర్లు కరువు
విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదనేలా ప్రభుత్వ తీరు
సాక్షి స్పెల్-బీ పరీక్షకు విశేష స్పందన
నేడు ఇలా..
కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా నూతన భవనాలు
చిన్నారులను ఆకట్టుకునేలా పెయింటింగ్స్
సైన్స్ ల్యాబ్‌లు
సరికొత్తగా డెస్‌్కలు, కుర్చీలు, ఇతర పరికరాలు
రన్నింగ్ వాటర్‌తో టాయ్‌లెట్లు
ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు
అదనపు తరగతి గదులు, వంటషేడ్లు
పరిశుభ్రమైన మంచి నీరు
ప్రతి పాఠశాలకూ రక్షణ గోడ
ప్రతి తరగతి గది డిజిటలైజేషన్
మొత్తంగా 12 రకాల సదుపాయాలు
ఇంగ్లిష్ మీడియం, బైజూస్ పాఠాలు
3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ
కౌమార దశలోని బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పథకం మొదటి దశలో రూ.3,700 కోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసింది.