Skip to main content

KGBV Schools: కేజీబీవీ బాలిక‌ల‌కు ముఖ్య‌మంత్రి భ‌రోసా

బాలిక విద్యార్థుల‌కు కేజీబీవీ విద్యాలయాలు భ‌రోసా క‌ల్పిస్తున్నాయి. ఈ ప‌థ‌కం ద్వారా బాలిక‌లు అన్ని రంగాల్లో ముందుకెళుతూ, వారు అనుకున్న ల‌క్ష్యాన్ని చేరాల‌ని తెలిపారు.
Tamballapalle KGBV School students
Tamballapalle KGBV School students

సాక్షి ఎడ్యుకేష‌న్: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ఆడపిల్లలకు, ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లే వారి బిడ్డలకు, దారిద్య్ర రేఖకు దిగువన జీవనం సాగిస్తున్న బాలికలకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు వరంగా మారాయి. ఉన్నత విద్య, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆంగ్లమాధ్యమంలో బోధన, యోగా, క్రీడలు, ఇతర సదుపాయాలు కలిస్తూ వారి భద్రతకు భరోసా కల్పిస్తున్నాయి. వృత్తి విద్య వారి బతుకుదెరువుకు మార్గం చూపుతోంది.

PM Appreciates Students: ప్ర‌ధాని విద్యార్థుల‌కు పంపిన ప్ర‌శంస ప‌త్రాలు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 2005లో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) ఏర్పాటు చేశారు. వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాడు–నేడు కార్యక్రమం ద్వారా కేజీబీవీల్లో అన్ని వసతులు కల్పించారు. పదో తరగతి అనంతరం విద్య మానేయకుండా వాటిలోనే ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టారు. అన్నమయ్య జిల్లాలో 21 కేజీబీవీలు ఉన్నాయి. వాటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు బోధిస్తున్నారు. ఒక్కో తరగతిలో 40 మంది విద్యార్థులు ఉంటారు. గతేడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించారు.

Degree Results: డిగ్రీ పునఃమూల్యాంకన ఫలితాలు విడుదల

2018లో కేజీబీవీల్లో ఇంటర్‌ తరగతులు ప్రారంభించారు. ఎంపీసీ, బైపీసీతోపాటు సీఈసీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు, ఐటీ, ఫుడ్‌ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, అగ్రికల్చర్‌, కుట్లు, అల్లికలు వంటి వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తున్నారు. దీంతో పదో తరగతి తరువాత డ్రాపౌట్స్‌గా మారకుండా ఇంటర్‌ విద్య కొనసాగిస్తూ బాలికలు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు.

Model Schools: టీజీటీలకు పీజీటీలుగా ఉద్యోగోన్నతులు.. సర్టిఫికెట్ల పరిశీలన

అన్ని సౌకర్యాలు

కేజీబీవీలలో పని చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వాచ్‌మెన్లు, వంట మనుషులు అందరూ మహిళలే. ఇక్కడ చదువుతున్న బాలికలకు ఉన్నత విద్య అందించేలా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటరాక్టివ్‌ ప్యానల్స్‌ ద్వారా డిజిటల్‌ విద్యాబోధన చేస్తున్నారు. నాణ్యమైన భోజనం, వసతి కల్పిస్తున్నారు. మూడు నెలలకోసారి ఆరోగ్య పరిశుభ్రత కిట్లు అందజేస్తున్నారు. బాలికా సాధికారత క్లబ్‌ల ఏర్పాటుపై వారికి అవగాహన కల్పిస్తున్నారు.

Global Graduates from AP: ఏపీ నుంచే ‘గ్లోబల్‌ గ్రాడ్యుయేట్స్‌’

ఉజ్వల భవిత

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలతో బాలిక విద్యకు భరోసా కలుగుతోంది. బాలికల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కేజీబీవీలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో బాలికలు చదువుకునే అవకాశం కలిగింది. కేజీబీవీల్లో చదివే విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి వివిధ రంగాల్లో రాణిస్తున్నారు.

Provisional Merit List of IERP Posts: ఐఈఆర్పీ పోస్టుల ప్రొవిజినల్‌ మెరిట్‌లిస్ట్‌ విడుదల

              –శ్రీరాం పురుషోత్తం,
            డీఈఓ, అన్నమయ్య జిల్లా

Published date : 11 Oct 2023 04:12PM

Photo Stories