Degree Results: డిగ్రీ పునఃమూల్యాంకన ఫలితాలు విడుదల
Sakshi Education

కర్నూలు (న్యూసిటీ): రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్‌లో జరిగిన డిగ్రీ 1, 2, 3వ సెమిస్టర్ పరీక్షల పున:మూల్యాంకన ఫలితాలను అక్టోబర్ 10న మంగళవారం ఉపకులపతి ఆచార్య ఎ.ఆనందరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి సెమిస్టర్‌లో 1,988 మంది దరఖాస్తు చేసుకోగా 508 మంది, మూడో సెమిస్టర్‌లో 3,099 మందికి గానూ 752 మంది, ఐదవ సెమిస్టర్‌లో 2,418 మంది పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోగా 690 మంది విద్యార్థులు పాసయ్యారన్నారు. ఫలితాలను రాయలసీమ విశ్వవిద్యాలయం వెబ్‌సైబ్‌లో ఉంచామన్నారు.
చదవండి: Global Graduates from AP: ఏపీ నుంచే ‘గ్లోబల్ గ్రాడ్యుయేట్స్’
Published date : 11 Oct 2023 03:12PM