Provisional Merit List of IERP Posts: ఐఈఆర్పీ పోస్టుల ప్రొవిజినల్ మెరిట్‌లిస్ట్ విడుదల
విజయనగరం అర్బన్: జిల్లాలోని భవిత కేంద్రాల ఐఈఆర్పీ పోస్టుల భర్తీ ప్రక్రియలో ప్రొవిజనల్ మెరిట్‌లిస్ట్‌ను డీఈఓ బి.లింగేశ్వరెడ్డి అక్టోబర్ 10న మంగళవారం విడుదల చేశారు. మెరిట్‌జాబితాను ‘డీఈఓ విజయనగరం’ వెబ్ సైట్‌లో, జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శనకు ఉంచారు. జాబితాపై ఎలాంటి అభ్యంతరాలున్నా అక్టోబర్11 బుధవారం సాయంత్రం 5 గంటలలోగా తెలియజేయాలని డీఈఓ సూచించారు. తదుపరి ఎంపిక ప్రక్రియలో స్కిల్‌టెస్ట్ ఉంటుందని, ఆ తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.
చదవండి: Model Schools: టీజీటీలకు పీజీటీలుగా ఉద్యోగోన్నతులు.. సర్టిఫికెట్ల పరిశీలన
నాణ్యమైన విద్యకు ‘జ్ఞానజ్యోతి’
మెంటాడ(గజపతినగరం రూరల్): జిల్లాలో 3–5 సంవత్సరాల వయస్సున్న పిల్లలకు ఫండ్‌మెంటల్స్‌తో కూడిన విద్యను అందించడమే జ్ఞానజ్వోతి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా విద్యాశాఖాధికారి డి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. మండలంలోని మరుపల్లి బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలలో ఐసీడీఎస్, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడురోజుల శిక్షణ శిబిరాన్ని ఆయన మంగళవారం పర్యవేక్షించారు. చిన్నారులకు అవగాహనాయుత విద్య ను బోధించాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో ఆచరించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ శాంతకుమారి పాల్గొన్నారు