Model Schools: టీజీటీలకు పీజీటీలుగా ఉద్యోగోన్నతులు.. సర్టిఫికెట్ల పరిశీలన
Sakshi Education
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీజీటీలకు అక్టోబర్ 12వ తేదీన వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జోన్ 4 పరిధిలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీజీటీలకు పీజీటీలుగా ఉద్యోగోన్నతులు కల్పించనున్నట్లు తెలిపారు. తుది సీనియారిటీ జాబితా ప్రకారం టీజీటీలు సంబంధిత రిజిస్టర్లు, ఒరిజనల్ సర్టిఫికెట్ల, 3 సంవత్సరాలు ఏసీఆర్(యాన్యూవల్ కాన్ఫిడెన్షిల్ రిపోర్టులు) తీసుకుని పరిశీలనకు హాజరుకావాన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన వైఎస్సార్ కడపలోని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 11 Oct 2023 02:35PM