PM Appreciates Students: ప్రధాని విద్యార్థులకు పంపిన ప్రశంస పత్రాలు
Sakshi Education
విద్యార్థల ద్వారా పరీక్షల విధానంపై ఉన్న అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రధాని నిర్వహించిన పరీక్షపై చర్చ-2023 లో విద్యార్థులు పాల్గొని వారి ఆలోచనలను, అభిప్రాయాలను తెలిపారు.
సాక్షి ఎడ్యుకేషన్: కశింకోటలోని సెయింట్ జాన్స్ స్కూలుకు చెందిన ముగ్గురు విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు లభించాయి. ప్రధాన మంత్రి ప్రస్తుత పరీక్ష విధానంపై విద్యార్థుల ఆలోచనాలు, అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇటీవల ‘పరీక్షపై చర్చ–2023’ నిర్వహించారు.
Records of 9 Months Kid: చిన్న పాపకు పెద్ద అవార్డులు
దీనిపై అభిప్రాయాలు, ఆలోచనలను స్థానిక సెయింట్ జాన్స్ స్కూల్లో 9, 10 తరగతులు చదువుతున్న టి.వై.నోహాలిక, ఎ.ఫణిత, వి.శ్రీవారుణీతేజలు రాత పూర్వకంగా తెలియజేశారు. వారి ఉజ్వల భవిష్యత్‌ను ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి తపాలా ద్వారా ప్రశంసా పత్రాలను పంపినట్లు స్కూలు కరస్పాండెంట్ బత్తుల అనూరాధ, ప్రిన్సిపాల్ రూపనంది మంగళవారం తెలిపారు.
Published date : 11 Oct 2023 03:42PM