Skip to main content

Jobs at RRB : ఆర్‌ఆర్‌బీలో వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. ఈ రీజియ‌న్స్‌లోనే..

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో జూనియర్‌ ఇంజనీర్‌ (జేఈ), మెటీరియల్‌ సూపరిండెంట్, కెమికల్‌–మెటలర్జికల్‌ అసిస్టెంట్‌ (సీఎంఏ), కెమికల్‌ సూపర్‌వైజర్‌ (రీసెర్చ్‌), మెటలర్జికల్‌ సూపర్‌వైజర్‌ (రీసెర్చ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Chemical-Metallurgical Assistant (CMA) Vacancy Announcement  Jobs at various regions of Railway Recruitment Board  Junior Engineer (JE) Recruitment Notification  Material Superintendent Job Application Metallurgical Supervisor (Research) Job Opening Chemical Supervisor (Research) Position Available

»    మొత్తం పోస్టుల సంఖ్య: 7,951.
»    ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పూర్, జమ్మూ–శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్, పాట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.
»    పోస్టుల వివరాలు: కెమికల్‌ సూపర్‌వైజర్‌/రీసెర్చ్‌ అండ్‌ మెటలర్జికల్‌ సూపర్‌వైజర్‌ /రీసెర్చ్‌–17 (ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్‌ మాత్రమే), జూనియర్‌ ఇంజనీర్,డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్, కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్‌ అసిస్టెంట్‌–7934.

Assistant Professor Posts : ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తులకు అర్హులు వీరే..

»    విభాగాలు: కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమిస్ట్రీ అండ్‌ ఫిజిక్స్‌ తదితరాలు.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(ఇంజనీరింగ్‌), బ్యాచిలర్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌/టెక్నాలజీ),బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 01.01.2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
»    వేతనం: నెలకు జూనియర్‌ ఇంజనీర్, yì పో మెటీరియల్‌ సూపరింటెండెంట్, కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్‌ అసిస్టెంట్‌ రూ.35,400. కెమికల్‌ సూపర్‌వైజర్‌/రీసెర్చ్‌ అండ్‌ మెటలర్జికల్‌ సూపర్‌వైజర్‌/రీసెర్చ్‌ రూ.44,900.
»    ఎంపిక విధానం: స్టేజ్‌–1,స్టేజ్‌–2 కంప్యూటర్‌ బే­స్డ్‌ టెస్ట్‌లు(సీబీటీ),డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మె­డికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

Free Skill Training: ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

»    స్టేజ్‌–1 పరీక్ష: మ్యాథ్స్‌(30 ప్రశ్నలు–30 మార్కులు), జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌(25 ప్రశ్నలు–25 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌(15 ప్రశ్నలు–15 మార్కులు), జనరల్‌ సైన్స్‌(30 ప్రశ్నలు–30 మార్కులు)సబ్జెక్ట్‌లు నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం ప్రశ్నల సంఖ్య–100, పరీక్ష సమయం–90 నిమిషాలు.
»    స్టేజ్‌–2 పరీక్ష: మొత్తం ప్రశ్నల సంఖ్య–150, పరీక్ష సమయం–120 నిమిషాలు. జనరల్‌ అవేర్‌నెస్‌ (15 ప్రశ్నలు–15 మార్కులు), ఫిజిక్స్‌ అండ్‌ కెమిస్ట్రీ(15 ప్రశ్నలు–15 మార్కులు), బేసిక్స్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌ అండ్‌ అప్లికేషన్‌(10 ప్రశ్నలు– 10మార్కులు),బేసిక్స్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌(10 ప్రశ్నలు–10 మా­ర్కులు), టెక్నికల్‌ ఎబిలిటీస్‌(100 ప్రశ్నలు–100 మార్కులు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఫీజు చెల్లింపు ప్రారంభతేది: 30.07.2024.
»    ఫీజు చెల్లింపుకు చివరితేది: 29.08.2024.
»    దరఖాస్తు సవరణ తేదీలు: 30.08.2024 నుంచి 08.09.2024 వరకు
»    వెబ్‌సైట్‌: https://rrbsecunderabad.gov.in

Free Civils Coaching: సివిల్‌ సర్వీస్‌ ఉచిత శిక్షణకు ప్రవేశపరీక్ష

Published date : 10 Aug 2024 03:32PM

Photo Stories