ONGC Scholarship 2023: 2000 స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం
స్కాలర్‌షిప్ సంఖ్య: 2000
ఓఎన్‌జీసీ ప్రతి సంవత్సరం 2000 స్కాలర్‌షిపులను అందిస్తోంది. వీటిలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 1000, ఓబీసీలకు 500, జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 500 స్కాలర్‌షిప్‌లు కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50శాతం స్కాలర్‌షిప్పులు మహిళలకు దక్కుతాయి. వీటిని దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదవుతున్నవారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్పు అందుతోంది. కోర్సు పూర్తయ్యేంత వరకు ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది.
Also read: Central Govt Scholarship 2022-23: మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్.. ఎవరు అర్హులంటే..
అర్హతలు
ఏదైనా విద్యాసంస్థల్లో ఫుల్‌టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజనీరింగ్(బీఈ/బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/జియో ఫిజిక్స్/ఎంబీఏ.. వీటిలో ఏ కోర్సులోనైనా 2021–22 విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదవుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ–జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60శాతం మార్కులుండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2లక్షలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5లక్షల వరకు ఆదాయం మించరాదు. ∙
- వయసు: జనవరి 01, 2021 నాటికి 30 ఏళ్ల లోపు వయసు వారై ఉండాలి.
- ఎంపిక ఇలా: ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులకు ఇంటర్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సులకు డిగ్రీలో సాధించిన మెరిట్ ఆధారంగా స్కాలర్‌షిప్పులను మంజూరు చేస్తారు.
- కాలవ్యవధి: ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి నాలుగేళ్లు, ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున స్కాలర్‌షిప్ మొత్తాన్ని చెల్లిస్తారు.
చదవండి: డిగ్రీకి రూ.2 లక్షలు, పీజీకి రూ.6 లక్షలు... ఇలా చేస్తే యూజీ, పీజీ ఫ్రీ
నిబంధనలు
ఇతర ఏ స్కాలర్‌షిప్పులు మంజూరు కానివారు మాత్రమే ఈ ఉపకార వేతనాలు పొందడానికి అర్హులు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా లబ్ధిపొందేవాళ్లు ఈ స్కాలర్‌షిప్‌లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారి వివరాలను ఓఎన్‌జీసీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ఆయా కోర్సులు చదివే భారతీయ విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులు.
స్కాలర్‌షిప్‌లు రెన్యూవల్ కావాలంటే.. ప్రతి ఏడాది కనీసం 50శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అంతకంటే తక్కువ స్కోరు సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను నిలిపివేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 06, 2023
- వెబ్‌సైట్:https://ongcscholar.org