Skip to main content

Central Govt Scholarship 2022-23: మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్.. ఎవరు అర్హులంటే..

Central Govt Scholarship 2022-23

ప్రతిభ కలిగిన మైనారిటీ విద్యార్థులకు కోసం కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అందించే ఈ స్కాలర్‌షిప్‌లకు 2022-23 విద్యాసంవత్సరానికి ప్రకటన వెలువడింది.

అర్హతలు
జైన, బౌద్ధ, సిక్కు, జొరాష్ట్రియన్, ముస్లిం, క్రిస్టియన్‌ వర్గాలకు చెందిన వారు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఏడాది రాసిన అకడమిక్‌ పరీక్షల్లో కనీసం 50శాతం మార్కులను పొంది ఉండాలి. అకడమిక్‌ ప్రతిభ, పుట్టిన తేదీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఇలా
అర్హత, ఆసక్తిగల వారు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గత ఏడాది స్కాలర్‌షిప్‌ పొందిన అభ్యర్థులు సంబంధిత ఐడీ నంబర్‌తో ప్రస్తుత విద్యాసంవత్సరానికి రెన్యువల్‌ చేసుకోవాలి.

చ‌ద‌వండి: CBSE Scholarships: బాలికలకు సీబీఎస్‌ఈ ఆర్థిక చేయూత.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌
ఇంటర్‌ లేదా తత్సమాన విద్యార్హత, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకూడదు.
అడ్మిషన్, ట్యూషన్‌ ఫీజుల కింద ఇంటర్‌(10+2) విద్యార్థులకు ఏడాదికి రూ.7000; ఇంటర్‌ స్థాయిలో ఒకేషనల్‌/టెక్నికల్‌ కోర్సులు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.10,000; డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్థులకు ఏడాదికి రూ.3000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. మెయింటెనెన్స్‌ అలవెన్స్‌ కింద ఇంటర్‌ స్థాయి కోర్సులు చదువుతున్న హాస్టల్‌ విద్యార్థులకు నెలకు రూ.380, డే స్కాలర్‌ విద్యార్థులకు నెలకు రూ.230; డిగ్రీ, పీజీ చదువుతున్న హాస్టల్‌ విద్యార్థులకు నెలకు రూ.570, డే స్కాలర్‌ వారికి రూ.300; పీహెచ్‌డీ, ఎంఫిల్‌ చేస్తున్న హాస్టల్‌ అభ్యర్థులకు నెలకు రూ.1200, డే సాల్కర్‌ విద్యార్థులకు రూ.550 స్కాలర్‌షిప్‌గా చెల్లిస్తారు.

మెరిట్‌ కం, మీన్స్‌ స్కాలర్‌షిప్‌

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో ప్రొఫెషనల్‌/టెక్నికల్‌ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.2,50,000 మించకూడదు.స్కాలర్‌షిప్‌:అర్హులైన అభ్యర్థులకు కోర్సు ఫీజు కింద ఏడాది రూ.20వేలు, మెయింటెనెన్స్‌ అలవెన్స్‌ కిందహాస్టల్‌ ఖర్చుల కోసం నెలకు రూ.1000, డే స్కాలర్‌కి నెలకు రూ.500 చెల్లిస్తారు. ఇంటర్న్‌షిప్‌ సమయంలో ఎటువంటి స్కాలర్‌షిప్‌ లభించదు.

ముఖ్య తేదీలు

  • పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌కు దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్‌ 31,2022
  • మెరిట్‌ కమ్‌ మీన్స్‌ బేస్డ్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌కు చివరి తేది: నవంబర్‌ 15,2022
  • వెబ్‌సైట్‌: https://scholarships.gov.in
  • వెబ్‌సైట్‌: https://www.minorityaffairs.gov.in/

చ‌ద‌వండి: Scholarships in NMMS: ఎన్‌ఎంఎంఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల.. రూ.12వేల స్కాలర్‌షిప్‌

Last Date

Photo Stories