AP PGCET 2021: ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2021
కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో.. 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2021(ఏపీ పీజీసెట్) నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు వివిధ పీజీ కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సుల వివరాలు: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎమ్మెస్సీ టెక్నాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత/చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
పరీక్ష తేది: 22.10.2021
వెబ్‌సైట్: http://www.yvu.edu.in/, https://sche.ap.gov.in