Paramedical Courses in AP: ఏపీ వైద్య కళాశాలల్లో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు
కోర్సులు: డీఎంఎల్‌టీ, డీఎంఐటీ, డీఓఏ, డీడీఐఏఎల్‌వై, డీఆర్‌ఈఎస్‌టీ, డీఎంఎస్‌టీ, డీఈఆర్‌ఎఫ్‌యూ, డీఓటీ, డీఆర్‌టీటీ, డీఆర్‌జీఏ, డీడీఆర్‌ఏ, డీకార్డియో, డీసీఎల్‌టీ, డీఈసీజీ, డీఏఎన్‌ఎస్, డీఎంపీహెచ్‌ఏ.
అర్హత: రెండేళ్ల కాలపరిమితి గల ఈ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్, బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 16 ఏళ్లు నిండి ఉండాలి. ఈ కోర్సులకు సంబంధించి ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది.
కాలేజీలు-జిల్లాలు: ఏపీలో మొత్తం తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, జిల్లాల్లోని పలు ప్రైవేటు పారామెడికల్ కళాశాలల్లో వివిధ పారామెడికల్ కోర్సులను అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లకు ఆ కాలేజీ పరిధిలోని జిల్లాలకు చెందిన అభ్యర్థులు(లోకల్) దరఖాస్తు చేసుకోవాలి.
సీట్ల సంఖ్య: తొమ్మిది గవర్నమెంట్ కాలేజీల్లో వివిధ పారామెడికల్ కోర్సుల్లో మొత్తం 1053 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా కాలేజీల పరిధిలోకి వచ్చే జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే వివిధ జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ పారామెడికల్ కాలేజీల్లో 17,254 పారా మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో మొత్తం 18,307 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఎంపిక విధానం: బైపీసీ విద్యార్థులు అందుబాటులో లేకుంటే ఎంపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు.ఈ రెండు గ్రూపు విద్యార్థుల లేకుంటే.. ఇతర గ్రూపు విద్యార్థులకు ప్రవేశం కల్పించే అవకాశం ఉంది. సీట్లను ప్రభుత్వ రిజర్వేషన్ల మేరకు ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనాను పూర్తిచేసి సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ చిరునామకు పంపాలి. ప్రైవేటు పారామెడికల్ కళాశాలల్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత జిల్లా వైద్యారోగ్య అధికారికి కార్యాలయం చిరునామకు పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తుతో జత చేయాల్సిన సర్టిఫికేట్‌లు: పదో తరగతి సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఇంటర్ సర్టిఫికేట్-మార్క్ షీట్స్, ఆరు నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్ తదితరాలు జత చేయాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.07.2023.
కౌన్సెలింగ్ నిర్వహణ, అభ్యర్థుల కేటాయింపు: 01.08.2023.
తరగతులు ప్రారంభం: 01.09.2023.
వెబ్‌సైట్: appmb.co.in/apsahpc.co.in
చదవండి: NIMS MHM Admission 2023: నిమ్స్ హైదరాబాద్‌లో ఎంహెచ్‌ఎం ప్రవేశాలు