Skip to main content

టీఎస్‌పీఎస్సీ, ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ(ఆర్‌ఐఎంసీ)లో.. జూలై 2022 టర్మ్‌ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన బాలుర నుంచి తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.
వయసు: 01.01.2022 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా.. పదమూడేళ్లకు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా వాయిస్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్, గర్హి కంట్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌–248003 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.10.2021

పరీక్ష తేది: 18.12.2021

వెబ్‌సైట్‌: www.tspsc.gov.in

Photo Stories