Skip to main content

Admission in TSWREIS: తెలంగాణ సాంఘిక సంక్షేమ కళాశాలల్లో ఎంఏ ప్రవేశాలు

తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌సిట్యూషన్స్‌ సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్‌).. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లో 2023-28 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ(ఎకనామిక్స్‌) కోర్సులో ప్రవేశాలకు అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Admission in TSWREIS

కోర్సు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ-ఎకనామిక్స్‌ కోర్సు (ఆంగ్ల మాధ్యమం).
సంస్థ పేరు: తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్, భువనగిరి/బీబీనగర్, యాదాద్రి భువనగిరి జిల్లా.

మొత్తం సీట్ల సంఖ్య: 40
అర్హత: 2022-23లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన బాలికలు అర్హులు.
వయసు: 01.06.2023 నాటికి 17ఏళ్లు నిండి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదా యం రూ.2,00,000(పట్టణ ప్రాంతం), రూ. 1,50,000(గ్రామీణ ప్రాంతం) మించకూడదు.

 

Technical Entry Scheme: ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

ఎంపిక విధానం: స్టేజ్‌-1(కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌), స్టేజ్‌-2(ఫిజికల్‌ టెస్ట్‌), సైకో అనలిటికల్‌ టెస్టులు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.06.2023
  • హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ తేది: 14.06.2023.
  • స్టేజ్‌-1(కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌) తేది: 18.06.2023
  • వెబ్‌సైట్‌: https://www.tswreis.ac.in/
Last Date

Photo Stories