Skip to main content

CAT 2022: క్యాట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..

cat 2022 notification released

దేశంలోని ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)ల్లో అడ్మిషన్స్‌ కోసం నిర్వహించే.. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌)–2022 నోటిఫికేషన్‌ విడుదలైంది.

అర్హతలు: కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ/ఎస్టీలు/దివ్యాంగులకు కనీసం 45శాతం మార్కులు రావాలి. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. 

పరీక్ష విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు విభాగాలు.. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌రీడింగ్‌ కాంప్రెహెన్షన్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి మలిదశలో గ్రూప్‌ డిస్కషన్, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు ఖరారు చేస్తారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 03.08.2022 నుంచి 14.09.2022 వరకూ
పరీక్ష తేది: 27.11.2022

 వెబ్‌సైట్‌: https://iimcat.ac.in

GATE 2023 Notification: గేట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు..

Last Date

Photo Stories