2 లక్షల డాలర్ల స్కాలర్‌షిప్ సాధించిన కొల్లూరు పూజ అపర్ణ.. సక్సెస్ స్టొరీ
Sakshi Education
ఇంజనీరింగ్.. మెడిసిన్.. బిజినెస్ మెనేజ్‌మెంట్.. ఇలా రొటీన్ కోర్సులకు భిన్నంగా సృజనాత్మక రంగమైన ఫిల్మ్‌మేకింగ్‌ను ఎంచుకుంది ఆ అమ్మాయి.. కాలేజీలో ఉన్నపుడే కొన్ని షార్ట్‌ఫిల్మ్స్, డాక్యుమెంటరీలను తీసింది.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అన్నింటా రాణిస్తూ.. అమెరికాలోని ప్రముఖ రింగ్లింగ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ కళాశాల క్యాంపస్‌లో సీటు సంపాదించింది.. అంతేనా..! అక్కడ నాలుగేళ్ల చదువుకయ్యే 2 లక్షల డాలర్లను స్కాలర్‌షిప్‌గా పొందనుంది విజయవాడకు చెందిన కొల్లూరు పూజ అపర్ణ. లక్ష్యం పట్ల స్పష్టత.. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే.. ఎవరైనా విజేతలుగా నిలుస్తారంటున్న అపర్ణ సక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే!!
సేవ.. సృజనాత్మకత:
ఏదో ఒకటి చదివేసి దొరికిన ఉద్యోగంతో స్ధిరపడాలనే ఆలోచన ఉండేది కాదు. సమాజానికి నా వంతు సాయపడుతూ.. సృజనాత్మకంగా ఏదైనా చేయాలని భావించా. పదో తరగతి పూర్తికాగానే నా లక్ష్యానికి తగిన కాలేజీని వెతుక్కొని పుణేలో రెండేళ్ల ఇంటర్నేషనల్ బ్యాక్యూలరేట్(ఐబీ) డిప్లొమా ఫిజిక్స్, ఎకనామిక్స్, స్పానిష్, ఇంగ్లిష్, ఫిల్మ్‌స్టడీ సబ్జెక్టులతో పూర్తిచేశా. డిప్లొమా పరీక్షలు పూర్తవగానే జనవరిలో అమెరికాలోని పేరున్న మూడు కాలేజీలకు దరఖాస్తు చేశా. అప్లికేషన్‌తోపాటు నా మెరిట్ సర్టిఫికెట్స్, అవార్‌డ్స, షార్ట్‌ఫిల్మ్స్, డాక్యుమెంటరీ అటాచ్ చేశా. మిగిలిన రెండు కాలేజీలు సగమే స్కాలర్‌ిషిప్స్ ఇస్తామంటూ మెయిల్ చేశాయి. రింగ్లింగ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ + డిజైన్ మాత్రమే నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యే వరకూ పాకెట్‌మనీతో సహా స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కాలేజీలో సీటు రావటంతోపాటు కోటి ఇరవై లక్షల రూపాయలకు పైగా స్కాలర్‌షిప్ ఇస్తామనటం ఆనందంగా ఉంది.
నాన్నే స్ఫూర్తి:
నాన్న వెంకట్, ఫోటో జర్నలిస్టు. అమ్మ రేణుకాదేవి బ్యూటీషియన్. చెల్లి ప్రియాంక ఇంటర్ ఫస్టియర్. నాపై నాన్న ప్రభావం ఎక్కువ. కెమెరాతో అప్పుడప్పుడూ ఫోటోలు తీయటం హాబీగా మారింది. క్రమేణా ఫిల్మ్స్ వైపు ఆసక్తి కలిగింది. ఫుణే వెళ్లి కోర్సులో చేరతానని చెప్పినపుడు నాన్న కొద్దిగా ఇబ్బందిపడ్డారు. కానీ, చివరకు నా మాటకే ఓటేశారు. ఆడపిల్లనని ఏ రోజూ కట్టడి చేయలేదు. విజయవాడ కేంద్రీయ విద్యాలయలో పదోతరగతి 9.2 గ్రేడ్‌తో పూర్తి చేశా. ఐబీలో కూడా మంచి మార్కులే వచ్చాయి. మూడోతరగతి నుంచే స్కౌట్స్‌లో చురుగ్గా పాల్గొనేదాన్ని. మన రాష్ట్రంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన క్యాంపులకు వెళ్లా. టెన్త్‌లో ఉన్నప్పుడు రాష్ట్రపతి పురస్కారం లభించింది. అదే సంవత్సరం పార్లమెంటరీ అవార్డు కూడా వచ్చింది. కేంద్రీయ విద్యాలయ క్లాసులు మధ్యాహ్నం 2.30 గంటలకే ముగిసేవి. మిగతా సమయాన్ని స్కౌట్స్, టేబుల్ టెన్నిస్, కల్చరల్ యాక్టివిటీస్‌కు కేటాయించేదాన్ని.
ఫిల్మ్‌మేకింగ్.. నా కల:
పదో తరగతి తర్వాత ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్‌లను కెరీర్‌గా మార్చుకోవాలనుకున్నా. ఆ సమయంలో పుణేలోని మహీంద్రా కాలేజీ గురించి తెలిసింది. ఇంటర్నెట్‌లో వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేశా. సీటు రావటంతో చేరిపోయా. ఈ ఏడాది జనవరిలో పరీక్షలు పూర్తికాగానే అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసేందుకు కొన్ని కాలేజీలకు దరఖాస్తు చేశా. ఫ్లోరిడాలోని రింగ్లింగ్ కాలేజీ నుంచి స్కాలర్‌షిప్ రావడంతో అక్కడే నాలుగేళ్ల ‘బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’లో ఫిల్మ్ మేకింగ్ ప్రధాన సబ్జెక్టుగా చేరబోతున్నా.
షార్ట్‌ఫిల్మ్స్‌తో గుర్తింపు:
పుణేలో చదివేటపుడు కోర్సులో భాగంగా ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. అందులో భాగంగా కొన్ని షార్ట్‌ఫిల్మ్స్ తీశా. నేనే స్వయంగా స్క్రిప్ట్, డెరైక్షన్ చేస్తూ.. రూపొందించిన ‘మ్యాడ్ వరల్డ్’ మంచి గుర్తింపు తెచ్చింది. ప్రకృతిని నాశనం చేసుకుంటూపోతున్న మనిషి చివరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఊహకు రూపం ఇది. ఫొటో జర్నలిజంలో భాగంగా రాజస్థాన్ వెళ్లినపుడు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా డాక్యుమెంటరీ తీశా. 2007లో హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో.. ‘ది డేట్’ పేరుతో షార్ట్‌ఫిల్మ్ తీశా. స్క్రిప్ట్ నుంచి కెమెరా, ఎడిటింగ్ అన్నీ స్వయంగా పూర్తిచేశా. ఇవన్నీ స్కాలర్‌షిప్ సాధించేందుకు దోహదపడ్డాయి.
డిస్కవరీ చానల్‌లో చేరాలనుంది:
సమాజాన్ని మార్చగల అస్త్రం.. మీడియా. ప్రజలతో ఉంటూ జనజీవితాన్ని ప్రపంచానికి చూపటం నాకిష్టం. దీనివల్ల మంచి పని చేస్తున్నామనే సంతృప్తి ఉంటుంది. కమర్షియల్ మూవీస్ చేయాలని లేదు. డాక్యుమెంటరీస్ మాత్రమే. అద్భుతం అనేలా మన దేశంలో రూపొందించిన సినిమాలు లేవనే చెప్పాలి. నాకు నచ్చిన డెరైక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్. ఫిల్మ్ మేకింగ్‌లో ఆయన స్టైలే డిఫరెంట్. అంతగొప్పగా కాకున్నా.. ప్రపంచం మెచ్చే డాక్యుమెంటరీస్ తీయాలని ఉంది. గ్రాడ్యుయేషన్ కోర్సు చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్‌ని మరింతగా మెరుగుపరచుకుంటా. ఆ తర్వాత నేషనల్ జియోగ్రాఫికల్, డిస్కవరీ వంటి చానల్స్‌లో పని చేయాలనుంది.
ఆత్మవిశ్వాసమే సగం బలం:
మనం పెరిగిన సామాజిక పరిస్థితులు ఆడపిల్లల ఎదుగుదలకు ఇబ్బందికరమే. కానీ వాటిని అధిగమించేలా తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వాలి. అమ్మాయిలు కూడా దాన్ని దుర్వినియోగం చేయకుండా ఉపయోగించుకోవాలి. అవరోధాలను అధిగమించాలంటే.. నేటి ఆధునిక మహిళకు కావల్సింది.. మెండైన ఆత్మవిశ్వాసం. దాంతోపాటు కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరాలంటే హార్డ్ వర్క్, టైం మేనేజ్‌మెంట్ ముఖ్యమే!!

Published date : 09 Aug 2013 03:39PM