Skip to main content

పది కోట్ల ప్రైజ్​మనీ రేసులో మన బిడ్డ..ఇంత‌కు ఏమి చేసిందంటే..?

మా వీధి చివర ఒక అంకుల్‌ రోజూ ఇస్త్రీ బండి మీద బరువైన ఐరన్‌బాక్స్‌తో కష్టపడడం చూశా.

రీయూజబుల్ ఎనర్జీతో తయారు చేయడం వల్ల ఆయనలాంటి వాళ్లకు ఈజీగా ఉంటుందనుకున్నా.  మనదేశంలో సూర్యుడు దాదాపు 250కిపైగా రోజులు ఉంటాడు. అందుకే ఈ సైకిల్​ కార్ట్​ని తయారుచేశా.  పైగా నా ఇన్నొవేషన్ ‘ఇస్త్రీవాలాలకు’లకు ఖర్చు తగ్గించడమే కాదు పర్యావరణానికి సాయం చేస్తుంది కూడా.. అంటోంది స్మార్ట్​ ఐరన్​ కార్ట్​ రూపకర్త వినీషా ఉమాశంకర్​.  ప్రతిష్టాత్మక యూకే పురస్కార ప్రైజ్​మనీ రేసులో నిలిచి.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మాయి. 

విశేషం ఏంటంటే..?
పొల్యూషన్‌ని తగ్గించే ఇన్నోవేషన్స్‌కి ఆదరణ పెరుగుతోంది.  ఈ క్రమంలో యువ ఆవిష్కరణకర్తలకు అవకాశం కల్పిస్తూ.. 1 మిలియన్​ పౌండ్స్​ (మనకరెన్సీలో పది కోట్లకు పైనే). ప్రిన్స్​ విలియమ్​ ‘ఎర్త్​షాట్​ ప్రైజ్’​  అందించబోతున్నారు. ఇందుకుగానూ సెప్టెంబ‌ర్ 17వ తేదీ (శుక్రవారం)  స్వయంగా 15 మంది పేర్లను ప్రకటించారు ప్రిన్స్​ విలియమ్​. ఈ లిస్ట్​లో 14 ఏళ్ల తమిళనాడు అమ్మాయి, చిల్డ్రన్స్‌ క్లైమేట్‌ ప్రైజ్‌ విన్నర్‌ వినీషా కూడా ఉంది. వాతావరణాన్ని కలుషితం చేయని ఇస్త్రీపెట్టె బండిని తయారు చేసింది వినీషా.సోలార్‌ ఎనర్జీతో పనిచేసే ఇస్త్రీపెట్టె బండిని డిజైన్‌ చేసింది తిరువణ్ణామలైకి చెందిన వినీషా ఉమాశంకర్‌. విశేషం ఏంటంటే.. లాక్​డౌన్​ టైంలో చిన్నారి సోలోగా ఆరునెలలు కష్టపడి మరీ ఈ బండిని డెవలప్ చేయడం. ఈ ఇన్నొవేషన్‌ని పరిశీలించిన నేషనల్ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌.. పేటెంట్‌ హక్కుల విషయంలో ఆమెకి సాయం  చేసింది కూడా. అయితే ఈ ఆలోచన బాగుండడంతో  స్వీడన్‌కి చెందిన చిల్ట్రన్స్‌ క్లైమేట్ ఫౌండేషన్‌ రీసెంట్‌గా క్లీన్ ఎయిర్‌ కేటగిరిలో వినీషాకి ‘చిల్డ్రన్స్‌ క్లైమేట్‌ ప్రైజ్‌’  అందించింది. అంతేకాదు స్వీడన్ ఎనర్జీ కంపెనీ ఈ ఐడియాను గ్రౌండ్‌ లెవల్‌లోకి తీసుకొచ్చేందుకు 11 వేల డాలర్ల సాయాన్ని వినీషాకి అందించింది.
 
కోటికి పైనే..
ఇళ్లలో కరెంట్‌తో పని చేసే ఐరెన్‌ బాక్స్‌లు ఉన్నప్పటికీ.. ఇస్త్రీ చేసేవాళ్లు మాత్రం ఇప్పటికీ ఐదుకేజీల బరువున్న ఇస్త్రీ పెట్టెలు.. వాటిలోకి కర్ర బొగ్గునే వాడుతున్నారు.  సైన్స్‌ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ లెక్కల ప్రకారం.. మనదేశంలో ఇస్త్రీవాలాల సంఖ్య కోటికి పైనే. వీళ్లంతా యావరేజ్‌గా రోజుకి ఐదు కేజీల చార్‌కోల్‌(బొగ్గు) ఉపయోగిస్తున్నారు. వీటివల్ల పర్యావరణానికి డ్యామేజ్‌ జరుగుతోంది. పైగా ఆ పొల్యూషన్‌ వల్ల వాళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ఇది గమనించిన వినీష ఈ సోలార్‌ ఐరన్‌ బండిని డిజైన్ చేసింది.  ఈ చక్రాల బండి పైకప్పు మీద సోలార్‌ ప్యానెల్స్‌ ఉంటాయి. వాటికి బ్యాటరీలు ఉంటాయి.

అవసరం అనుకుంటే..
సన్‌లైట్‌లో  ఐదు గంటలపాటు ఉంటే చాలు ఈ బండి ఛార్జ్‌ అవుతుంది. ప్యానెల్‌కి ఉన్న ఒక్కో బ్యాటరీ ఆరు గంటలు పని చేస్తుంది.  వాటి సాయంతో ఐరన్‌ బాక్స్‌ పని చేస్తుంది. అంతేకాదు ఈ బండికి యూఎస్‌బీ పోర్ట్‌ ఫెసిటిటీస్‌ కూడా ఏర్పాటు చేసింది వినీష.  అవసరం అనుకుంటే ఈ బండికి జనరేటర్‌ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ ఐరన్‌ కార్ట్ ధర రూ. 40 వేలు.  అయితే ఇస్త్రీవాలాలు కర్రబొగ్గు మీద చేసే ఖర్చుని ఈ సోలార్‌ ఇస్త్రీ బండి మాగ్జిమమ్‌ తగ్గించేస్తుందని చెబుతోంది వినీష.

ఈ ప్రైజ్​ మనీ..
కిందటి ఏడాది అక్టోబర్​లో ఈ ఎర్త్​షాట్ ప్రైజ్​ అనౌన్స్​ చేశారు. ఈ పదిహేనులో(ఒక నగరం కూడా ఉంది)..  ఐదుగురికి ప్రైజ్​ మనీ పంచుతారు.  అక్టోబర్​ 17న లండన్​  అలెగ్జాండ్రా ప్యాలెస్​లో విజేతలకు ప్రైజ్​ మనీ అందిస్తారు.

Published date : 18 Sep 2021 07:23PM

Photo Stories