Skip to main content

IT Jobs : జాక్‌పాట్‌ కొట్టేసింది.. ఏకంగా 64.61 లక్షల జీతంతో ఉద్యోగం.. ఎలా అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఐఐఎం సంబల్‌పూర్ ప్లేస్‌మెంట్లు విషయంలో సరికొత్త రికార్డ్‌ సాధించారు. గత 7 సంవత్సరాల మాదిరిగానే, ఈ సారి 2021-2023 ఏడాదికి గాను 100శాతం ప్లేస్‌మెంట్స్‌తో సంస్థ చరిత్ర సృష్టించింది.
avni malhotra it job telugu news
Avni Malhotra

2023లో ఎంబీఏ ఉత్తీర్ణులైన 167 మంది విద్యార్థులు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు పొందగా, వీరిలో 80మంది విద్యార్థినులున్నారు. వీరిలో 65 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించి అవని మల్హోత్రా టాప్‌ ప్లేస్‌ కొట్టేసింది. హయ్యస్ట్‌ ప్యాకేజీ అందుకున్న  వరుసలో తమిళనాడు, రాజస్థాన్‌ విద్యార్థులు  నిలిచారు.

హయ్యస్ట్‌ సాలరీ ఈమెకే..

Avni Malhotra success story in telugu

జైపూర్‌కు చెందిన అవనిమల్హోత్రా మైక్రోసాఫ్ట్‌లో భారీ ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించి వార్తల్లో నిలిచింది. ఏకంగా 64.61 లక్షల వార్షిక జీతాన్ని అందుకోనుంది. పట్టుదల,  కృషి ఉంటే విజయం వచ్చి వరిస్తుందనే మాటకు నిదర్శనంగా తన డ్రీమ్‌ జాబ్‌ను కొట్టేసింది అవని. ఐదారు రౌండ్ల ఇంటర్వ్యూల్లో విజయం సాధించి జాక్‌పాట్‌ కొట్టేసింది.

☛ Success Story : తొలి సంపాదన రూ.5వేలు మాత్రమే.. ఇప్పుడు వేల కోట్లల‌కు.. అధిప‌తి అయ్యాడిలా..

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో మూడేళ్లపాటు సేవలందించిన అనుభవం, సంస్థాగత సామర్థ్యం కారణంగా ఆమెను ఎంపిక చేశారట. దీంతోపాటు  కంప్యూటర్ సైన్స్‌లో బీ.టెక్‌  చదవడం ప్రత్యేకంగా నిల బెట్టిందని చెప్పింది. ఈ చాలెంజ్‌ను ఛేదించడంలో సాయం చేసిన ప్రొఫెసర్‌లకు, తల్లిదండ్రులకు  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

☛ Inspirational Story: అచ్చంగా స్టూడెంట్‌ నంబర్‌ 1 సినిమా స్టోరీనే.... జైలులో ఉండి చదువుకుంటూ ఏకంగా గోల్డ్‌ మెడ్‌ల్‌ సాధించాడు.. ఎలాగంటే

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, తమ విద్యార్థుల గొప్ప ప్లేస్‌మెంట్ సాధించారని ఐఐఎం సంబల్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మహదేవ్ జైస్వాల్ సంతోషం ప్రకటించారు. తమ సంస‍్థలో సంవత్సరానికి అత్యధిక జీతం రూ.64.61 లక్షలుండగా, సగటు జీతం రూ.16 లక్షలుగా ఉందని తెలిపారు. మైక్రోసాఫ్ట్, వేదాంత, తోలారం, అమూల్, అదానీ, ఈవై, యాక్సెంచర్, కాగ్నిజెంట్, డెలాయిట్, అమెజాన్‌ లాంటి దిగ్గజ సంస్థల్లో తమ విద్యార్థులు ప్లేస్‌ అవుతున్నారన్నారు.

☛ Inspirational Story: ‘ఇన్పోసిస్‌’లో ఉద్యోగం వ‌దిలి.. మోటివేషనల్‌ స్పీకర్‌గా ఎదిగి..

Published date : 30 Mar 2023 07:48PM

Photo Stories